Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దారి త‌ప్పి బీచ్ కి వ‌చ్చిన మ‌యూరం

By:  Tupaki Desk   |   17 Jan 2021 3:53 AM GMT
ఫోటో స్టోరి: దారి త‌ప్పి బీచ్ కి వ‌చ్చిన మ‌యూరం
X
ఇటీవ‌ల హాటెస్ట్ బికినీల‌కు వేదిక‌గా మారిన మాల్దీవుల నుంచి మ‌రో అదిరిపోయే ఫోటోషూట్ ఇది. ఈసారి కే- బ్యూటీ క‌త్రిన వంతు. అందాల క‌త్రిన ఆరంగేట్రంతో బికినీ బీచ్ ఎరుపెక్కింది. దారి తప్పి ఎట్నుంచో వ‌చ్చిన పీకాక్ బులుగు జిలుగు బీచ్ లో రెడ్ హాట్ డ్రెస్ ధ‌రించిన‌ట్టుగా ఉంది మ‌రి. ఇప్ప‌టివ‌ర‌కూ బీచ్ వెద‌ర్ లో బికినీల‌ ట్రీట్ వేరు.. క‌త్రిన ఇచ్చిన ట్రీట్ వేరే లెవ‌ల్ అన్న‌ట్టుగానే ఉంది.

ప్ర‌ఖ్యాత‌ పీకాక్ మ్యాగజైన్ ముఖచిత్రంగా కనిపించిన కత్రినా ట్రూ ఐకానిక్ గా వెలిగిపోతోంది. పీకాక్ ఇండియాకు చెందిన ఫల్గుని షేన్ రూపొందించిన ఎరుపు రంగు దుస్తులను ధరించి.. మాల్దీవుల్లో బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెల్లో క్యాట్ ముగ్ధ‌మ‌నోహ‌రిని త‌ల‌పిస్తోంది. వ‌య‌సు న‌ల‌భైకి చేరువ అవుతున్నా త‌న‌లోని వ‌న్నెచిన్నెలు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఇంకా టీనేజీ మిస‌మిస‌లు త‌న‌లో ఉన్నాయ‌ని ఈ ఫోటోషూట్ మ‌రోసారి ప్రూవ్ చేసింది. రెడ్ హాట్ డిజైన‌ర్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టు ప‌చ్చ‌లు పొదిగిన డిజైన‌ర్ ఆభ‌ర‌ణాన్ని ధ‌రించి మ‌రింత వేడి పెంచింది క‌త్రిన‌.

ఇంత‌కుముందు క‌త్రిన‌ సొంత బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ `కే బై కత్రిన` ప్రారంభించిన సంగ‌తి తెలిసిన‌దే. ఈ బ్రాండ్ ప్రారంభ అనుభ‌వంపై మాట్లాడుతూ.. ``మీరు ఎలా ఉన్నారో ఊహించి.. అంతర్గతంగా మిమ్మల్ని స్టార్ గా డిజైన్ చేస్తాం .. మీరు జీవితాన్ని ఏ కోణంలో చూస్తారు? దాని గురించి మీరు అర్థం చేసుకున్నది ఏమిటి?.. మీరు సాధన చేసేది ఏదీ? అన్న‌ది ఈ బిజినెస్ కి తోడ్పడుతుంది``అని కత్రిన క్లాస్ తీస్కుంది. క్యాట్ కెరీర్ సంగ‌తి చూస్తే... అక్షయ్ కుమార్ సరసన `సూర్య వన్షి` లో క‌త్రిన న‌టించింది. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుంది. దీంతో పాటు ప‌లు భారీ చిత్రాల్లోనూ క‌త్రిన న‌టించ‌నుంది.