Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: వోగ్ కోసం నయన్ ఫ్యాషన్
By: Tupaki Desk | 5 Oct 2019 2:12 PM GMTసౌత్ లో సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ నయనతార. తెలుగు.. మలయాళం.. తమిళంలో దాదాపు అందరూ టాప్ లీగ్ స్టార్లతో నటించిన నయన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రెస్ గా ఉంది. నయన్ సినిమా అంటే చాలు మినిమమ్ గ్యారెంటీ అనే పేరు రావడంతో నయన్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అయితే ఇంత క్రేజ్ ఉన్న నయనతార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీ కాదు.
అంతే కాదు.. ఇంటర్వ్యూలు ఇవ్వదు.. కవర్ పేజిల కోసం ఫోటో షూట్లు చెయ్యదు.. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదు.. మిగతా సెలబ్రిటీలలాగా తనగురించి డప్పు కొట్టుకోదు. అయితే జస్ట్.. ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టుగా రీసెంట్ గా ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ వారికోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు కూడా వోగ్ వారే తమ అధికారిక ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు వారు ఇచ్చిన క్యాప్షన్ "టాప్ వ్యూ. అక్టోబర్ 2019 ఎడిషన్ ను ఫిమేల్ సూపర్ స్టార్ నయనతారతో సెలెబ్రేట్ చేసుకుంటున్నాం." ఇక ఫోటో విషయానికి వస్తే నయన్ లైట్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి సూపర్ స్టైలిష్ గా నిలుచుంది. షోల్డర్ దగ్గరున్న ఫ్లవర్ డిజైన్ డ్రెస్ అందాన్ని మరింతగా పెంచింది. డార్క్ లిప్ స్టిక్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో నయన్ రెగ్యులర్ స్టైల్ లో కాకుండా బాలీవుడ్ హీరోయిన్ తరహాలో కనిపిస్తోంది.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "తలైవి వేర లెవల్".. "నయన్ ఈజ్ కిల్లింగ్".. "సూపర్ స్టార్.. సూపర్ స్టైల్" అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఒకరిద్దరు నెటిజన్లు మాత్రం "నయన్ కాళ్ళు ఉల్టా పల్టా ఉన్నాయి చూసుకోండి" అన్నారు. సినిమాల విషయానికి వస్తే నయన్ ప్రస్తుతం రజనీకాంత్ 'దర్బార్' లోనూ విజయ్ 'బిగిల్' లోనూ హీరోయిన్ గా నటిస్తోంది.