Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఆప్టేగారి పాత భంగిమ
By: Tupaki Desk | 26 March 2020 3:30 AM GMTరాధిక ఆప్టే పేరు తెలియని సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. బాలీవుడ్ భామే అయినప్పటికీ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు ఆప్టేగారి సూపర్ హాటు క్లిప్పులు ఏదో ఒక సందర్భంగా ఎదురయ్యే ఉంటాయి. ఇతర భామల తరహాలోనే రాధిక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తుంది.
బిజీగా ఉన్న సమయంలోనే ఏదో ఒక అప్డేట్ తో అభిమానులతో టచ్ లో ఉండే రాధిక ఈ కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ఎలా ఊరుకుంటుంది? తాజాగా తన రాధిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ #సిల్వర్.. #త్రో బ్యాక్ అంటూ హ్యాష్ టాగ్స్ జోడించింది. అంటే.. ఫుల్లుగా ఖాళీ సమయం చిక్కడంతో ఎప్పటివో పాత ఫోటోలు వెలికి తీసి వాటిని ఇప్పుడు పోస్ట్ చేస్తోంది. తప్పేమీ లేదు.. చాలామంది హాటు భామలు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సమయంలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన.. భూలోక స్వర్గం లాంటి నెంబర్ వన్ దేశంలో తప్ప మన భారతదేశంలో ఎవరినైనా బీచ్ లో తిరగనిస్తారా.. పార్టీలు చేసుకోనిస్తారా? ఫోటోలు తీసుకోనిస్తారా? ఆసలే మనది అభివృద్ధి చెందు..తూ ఉన్న దేశం. తేడా వస్తే పోలీసులు తాట తీస్తారు. దండం దశగుణం భవేత్ అనే నానుడిని నమ్మే పాలకులు పుష్కలంగా ఉన్న దేశం!
ఈ ఫోటోలో సిమెంట్ రంగు స్లీవ్ లెస్ గౌన్ ధరించిన రాధిక అంతర్జాతీయ మోడల్ తరహాలో కనిపిస్తోంది. చెవులకు వెడల్పాటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తలకు కొప్పు కట్టుకుని ఓ వెరైటీ స్టైల్ లో కనిపిస్తోంది. ఈ ఫోటోకు మంచి కామెంట్లే పెట్టారు లాక్ డౌన్ నెటిజన్లు. "ప్రిన్సెస్ లాగా కూర్చున్నావ్".. "దుప్పటితో కుట్టిన డ్రెస్సా".. "వాట్ ఎ గ్రేస్" అంటూ తమ స్పందన తెలిపారు. సినిమాల విషయానికి వస్తే రాధిక చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు.