Begin typing your search above and press return to search.
వైటు బ్లౌజు పింకు దుప్పటా వేస్తివా పాపా
By: Tupaki Desk | 25 March 2020 9:30 PM GMTగత కొంతకాలంగా అందాల రకుల్ ప్రీత్ కెరీర్ రివర్స్ స్వింగులో ఉన్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోలు ముఖం చాటేయడంతో వరుసగా ముదురు హీరోలకు ఓకే చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఇటు టాలీవుడ్ లో కెరీర్ లాక్ డౌన్ అయిపోయాక ఏదీ తోచని పరిస్థితిలో చివరికి ఇలా మారిందా? అంటూ అంతా సెటైర్లు వేస్తున్నారు. అదృష్టమో దురదృష్టమో మొత్తానికి వరుసగా వెటరన్ స్టార్లు అవకాశాలైతే ఇచ్చి ఆదుకుంటున్నారు.
తెలుగులో కింగ్ నాగార్జున మన్మధుడు 2లో ఛాన్సిచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఆఫర్లు లేవు. దీంతో నైసుగా ముంబై పరిశ్రమకు వెళ్లిపోయి తన పరిచయాల్ని తెలివిగా యుటిలైజ్ చేస్తోంది. అక్కడ అజయ్ దేవగన్.. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోలు ఈ అమ్మడికి అవకాశాలిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటు సౌత్ లోనూ కమల్ హాసన్ లాంటి వెటరన్ రకుల్ కి ఓ ఆఫర్ ఇచ్చి ఆదుకున్నారు. భారతీయుడు 2 లాంటి క్రేజీ ప్రాజెక్టులో ఒక కథానాయికగా ఎంపికైంది.
అదంతా సరే కానీ.. క్రేజు తగ్గిందనో లేక తనని తాను పోటీలో నిలబెట్టుకోవాలనో రకుల్ నానా తంటాలు పడుతోంది. ఇదిగో ఇలా రెగ్యులర్ గా ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో నెటిజనులకు టచ్ లో ఉంటోంది. వైటు బ్లౌజు పింకు దుప్పటా వేసిన పాపయమ్మలా ఏమిచ్చింది ఈ ఫోజు? ఆ మేకప్ హంగులు కాస్త అదుపు తప్పాయి కానీ బుట్టబొమ్మకు జెరాక్స్ కాపీలానే ఉంది. ఆ మెడలో పింకు- వైట్ మిక్సింగ్ ముత్యాల హారం అదిరెనమ్మా.. ఆ చేతికి అల్లిన గవ్వల గాజు సోకు బావుందమ్మా! అంటూ కుర్రాళ్లు ఫికర్ చేస్తున్నారు. మొత్తానికి రకుల్ ఇస్పీడ్ ఇలా ఉంది మరి.
ప్రస్తుతం రకుల్ ప్రీత్.. జాన్ అబ్రహం సరసన `ఎటాక్` చిత్రంలో నటిస్తోంది. ఇది ఏడాది క్రితమే మొదలైనది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇందులో మరో హీరోయిన్. అజయ్ దేవగన్- సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా.. ఇంద్రకుమార్ దర్శకత్వంలో `థ్యాంక్ గాడ్` పేరుతో ఓ సినిమా ఓకే అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఈ ఎన్జీకే భామని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.