Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అమ్మడు..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 4:52 AM GMT
ఫోటో స్టోరీ : బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అమ్మడు..!
X
తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ షిఫ్ట్ అయిన భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో కెరీర్ దాదాపు ముగిసిందనే అనుకోవచ్చు. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ డం తెచ్చుకున్న ఈ అమ్మడు అంతే తక్కువ టైం లో ఫేడవుట్ అయింది.

చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వకపోవడంతో అమ్మడు కూడా డీలా పడింది. ఇక తనకు అవకాశాలు ఇస్తున్న బాలీవుడ్ వైపే ఆసక్తి చూపిస్తుంది రకుల్. అక్కడ సోలో హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గా కూడా చేస్తుంది అమ్మడు.

సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ విషయంలో కూడా అమ్మడు దూకుడు చూపిస్తుంది. లేటెస్ట్ గా బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ సోయగాలతో అలరిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. తన మార్క్ బోల్డ్ అటెంప్ట్ తో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ని తన బుట్టలో పడేసుకుంటున్న రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ తో కూడా అదరగొట్టేస్తుంది.

అమ్మడి థై షోకి కూడా కుర్రాళ్లు పడిపోతున్నారు. సినిమాల లెక్క ఎలా ఉన్నా రకుల్ సోషల్ మీడియా సెన్సేషన్ గా నిలిచింది. ఫోటో షూట్స్ తోనే రకుల్ తన గ్రాఫ్ పెంచుకోవాలని చూస్తుంది. సౌత్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకున్నా బాలీవుడ్ లో మాత్రం అమ్మడు ఒక మోస్తారు ఇమేజ్ తో దూసుకెళ్తుంది.

ఇక పర్సనల్ లైఫ్ లో కూడా తన తోడుని వెతుక్కుంది రకుల్. జాకీ భగ్నానితో ఈమధ్య రకుల్ క్లోజ్ గా ఉంటుంది. అతనితోనే అమ్మడు ఏడడుగులు వేస్తుందని అంటున్నారు. జాకీ, రకుల్ ల జోడీ ఈమధ్య ముంబై మీడియా వార్తల్లో నిలుస్తుంది. త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ అంతా పెళ్లి చేసుకుంటుంటే రకుల్ కూడా వారి దారిలోనే పెళ్లికి రెడీ అవుతుంది.

ఎలాగు పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ఈమద్య హీరోయిన్స్ కెరీర్ మంచి దూకుడు మీద ఉన్నా సరే పెళ్లి చేసుకునేందుకు ఓకే అంటున్నారు. మరి రకుల్ పెళ్లి ముహుర్తం ఎప్పుడు బయట పడుతుందో చూడాలి. సినిమాలతోనే కాదు ఫోటో షూట్ లతో అలరిస్తున్న రకుల్ త్వరలోనే పెళ్లి డేట్ చెప్పి షాక్ ఇస్తుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.