Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: రంగీలా స్టైల్లో ఉతికారేసిన దిశ!

By:  Tupaki Desk   |   23 Oct 2019 9:17 AM GMT
ఫోటో స్టోరీ: రంగీలా స్టైల్లో ఉతికారేసిన దిశ!
X
బాలీవుడ్ లో చాలామందే హాటు భామలు ఉంటారు కానీ వారందరిలో మళ్ళీ ఒక హాటు పోటీ పెడితే మాత్రం దిశా పటాని ఫస్టు ప్రైజును ఇంటికి పట్టుకుపోతుంది. దిశా దగ్గర అంత విషయం ఉంది. అందుకే దిశ దెబ్బకు కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. దిశ స్వయంగా పోస్ట్ చేసే ఫోటోలు ఎలాగూ వైరల్ అవుతాయి. అవి కాకుండా దిశా బైట దర్శనిమిస్తే ముంబై మీడియావారు ఆమె ఫోటోలను తీస్తారు కదా.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తాయి.

రీసెంట్ గా దిశ ముంబైలోని ఒక పోష్ ఏరియా అయిన బాంద్రాలో ఒక సెలూన్ కు వెళ్ళింది. అసలే హాటు భామ.. అంతకంటే హాటుగా డ్రెస్ వేసుకుంది.. దీంతో ఫోటోగ్రాఫర్లు ఎంతో నైపుణ్యంతో ఆ ఫోటోలను తమ కెమెరాలలో బంధించారు. ఆ ఫోటోలో దిశా ధరించిన డ్రెస్సు ఎవరి మనసులో అయినా స్పందనలు కలగజేసేలా ఉంది. స్లీవ్ లెస్ వైట్ టాప్ విత్ డీప్ వీ నెక్.. దాంతో పాటు లైట్ బ్లూ కలర్ స్కర్ట్. ఆ స్కర్ట్ ను చూస్తే ఎలాంటి స్త్రీ ద్వేషి హృదయమైనా నిముషానికి 170 సార్లు లబోదిబో అని కొట్టుకోవాల్సిందే. ఆ స్టైల్.. ఆ స్మైల్ అదరహో.

ఇక్కడ మనం ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఇలాంటి హాటు భామను.. ఆమెలో అంతర్గతంగా ఉన్న స్పార్కును మొదట గుర్తించింది మన ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. దీన్ని బట్టి ఆయన కే. రాఘవేంద్రరావు గారి లెగసీని ఈ జెనరేషన్లో ముందుకు తీసుకుపోతున్న వ్యక్తిగా మనం గుర్తించాలని చెప్పకతప్పదు. దిశా సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం 'మలంగ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.