Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దీపిక‌నే కొట్టేస్తున్న శ‌ర్మాగాళ్

By:  Tupaki Desk   |   11 April 2022 4:09 AM GMT
ఫోటో స్టోరి: దీపిక‌నే కొట్టేస్తున్న శ‌ర్మాగాళ్
X
దీపికా పదుకొణె - నేహా శర్మ హిందీ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఇంచుమించు ఒకేసారి ప్ర‌వేశించారు. పరిశ్రమలో అత్యంత అందమైన మోడ‌ల్స్ గా ఆక‌ట్టుకుని న‌ట‌న‌లోకి వ‌చ్చారు. 2006లో ఐశ్వ‌ర్య అనే క‌న్న‌డ సినిమాతో దీపిక ఎంట్రీ ఇవ్వ‌గా ఓం శాంతి ఓం హిందీలో తొలి సినిమా. 2007లో చిరుత మూవీతో నేహా శ‌ర్మ క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసింది. కానీ దీపిక స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగింది. కానీ నేహా శ‌ర్మ‌కు కెరీర్ ఆశించిన రేంజు ద‌క్క‌లేదు. ఓం శాంతి ఓం దీపిక‌కు బిగ్ బ్రేక్ నివ్వ‌గా చాలా సంవత్సరాలుగా బాలీవుడ్ లో పాపుల‌ర్ నాయిక‌గా కొన‌సాగుతోంది.

ఇక గత కొన్ని సంవత్సరాలుగా వృత్తిపరమైన స్థాయిలో నేహా కెరీర్ ఫ‌ర్వాలేద‌నిపించే రేంజులో ఉంది. ఇటీవ‌ల‌ వెబ్ సిరీస్ లు లేదా భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలతో బిజీ అయ్యింది. న‌టించిన‌ ప్రతిచోటా తన ప్రభావాన్ని చూపిస్తోంది నేహా. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌కు క‌మిటైంది నేహా. ఈ ప్రయాణం బావుంద‌ని నేహా సంతృప్తిగా కనిపిస్తుంది.

ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ విషయానికి వస్తే దీపిక ఎప్పుడూ టాప్ స్లాట్ లో ఉంది. ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేని అగ్ర నాయిక అన‌డంలో సందేహం లేదు. ఇక సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌లో మాత్రం భామ‌లిద్ద‌రూ ఎల్లప్పుడూ టాప్ పొజిష‌న్ లో ఉంటారని మనందరికీ బాగా తెలుసు. ఇటీవ‌ల ఈ ఇద్ద‌రి ఇన్ స్టాగ్రామ్ కంటెంట్ ఒక రేంజులో అల‌రిస్తోంది. దీపికా ప్రతి వేసవిలో వేడెక్కించే వైబ్ కోసం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ చేస్తుంటుంది. ఇటీవ‌ల గెహ్రాయాన్ ప్ర‌మోష‌న్స్ లో దీపిక వేష‌ధార‌ణ నిరంత‌రం హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక నేహా శ‌ర్మ వ‌రుస ఫోటోషూట్లు దీపిక కు ఏమాత్రం త‌క్కువ కాదు. తాజాగా నేహా బ్రాలెట్ లో తన హాట్ ఫోటోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. అక్కడ ఆమె తనను తాను హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడాన్ని ఆనందిస్తున్నాన‌ని తెలిపింది. అలా ఫ్లేవ‌ర్డ్ బాటిల్ తో నేహా ఇచ్చిన ఫోజ్ కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఫోటోని వీక్షించ‌గానే యూత్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు.

డీహైడ్రేష‌న్ పుట్టిస్తున్న శ‌ర్మా గాళ్! అంటూ ఒక కొంటె అభిమాని కామెంట్ చేయ‌గా... అలా జిప్ విప్పి ఇన్న‌ర్ లో శ‌ర్మా గాళ్ దుమారం రేపుతోంది! అంటూ త‌న ఫోటోషూట్ పై రివ్యూ చేశాడు వేరొక అభిమాని. జిప్ లెస్ బాట‌మ్.. బ‌ట‌న్ లెస్ ఇన్న‌ర్ లో దీపిక‌నే మించిపోయింది అంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు.

ఫిట్నెస్ సీక్రెట్స్ లీక్...

నేహా శ‌ర్మ ఫిట్ నెస్ ర‌హ‌స్యం ఏమిటో తెలుసుకోవాల‌ని అభిమానులు ఉబ‌లాట‌ప‌డుతున్నా ఆ సీక్రెట్ ఏంటో ఇప్ప‌టివ‌ర‌కూ తెలీదు. కానీ దీపిక ఫిట్ నెస్ ట్రైన‌ర్ నేహాకు కూడా ట్రైనింగ్ ఇస్తుండ‌డం విశేషం. శ్ర‌మిస్తే ఫిట్ నెస్ తో పాటు అందం మ‌రింత‌ పెరుగుతుంటుంది. ఫిట్ నెస్ తో ప్రమాణం చేసే తార‌లు జిమ్ కి వెళ్లడాన్ని ఒక్క రోజు కూడా మిస్ చేయ‌రు. జిమ్ లో చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన తన వైఫల్యాలను పంచుకోవాలని నేహా నమ్ముతుందని ట్ర‌యిన‌ర్ ఇంత‌కుముందు వెల్ల‌డించారు. నేహా సోదరి ఐషా శర్మ కూడా సిస్ట‌ర్ కి ఫాలోవ‌ర్ గానే కనిపిస్తుంది.