Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: పింక్ లో త‌మ‌న్నా ఘాటు అందాలు

By:  Tupaki Desk   |   20 March 2022 9:30 AM GMT
ఫోటోస్టోరీ: పింక్ లో త‌మ‌న్నా ఘాటు అందాలు
X
పింక్ క‌ల‌ర్ టూపీస్ బికినీ ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ హీరోయిన్ ఆ రంగు టూపీస్ ధ‌రించినా ధ‌గ‌ధ‌గ‌లాడిపోతుంది. హీరోయిన్ రంగుతో ప‌నిలేకుండా పింక్ రంగులో మెరిసిపోతుంది. పింక్ లో హైలైట్ అయ్యే స్పెషాల్టీ అదే. మ‌రి పాల నురుగ‌ల అందం త‌మ‌న్నా భాటియా లాంటి భామ అదే రంగు బికినీ ధ‌రించి క్యామ్ కి ఫోజులిస్తే ఇంకేరేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా అదే స‌న్నివేశం చోటు చేసుకుంది.

తాజాగా త‌మ‌న్నా పింక్ టూపీస్ లో మంటలు రేపుతోన్న ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. న‌డి స‌ముంద్రంలో బ్యూటీ ప‌డ‌వ యానం చేస్తూ మ‌ధ్య‌లో ఇలా పింక్ క‌ల‌ర్ టూపీస్ లో కెమెరాకి వ‌య్యారంగగా ఫోజులిచ్చింది. పింక్ బికినీపై మ్యాచింగ్ వైట్ అండ్ పింక్ ప‌లుచ‌ని వ‌స్ర్తం ధ‌రించి ఆక‌ట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి ఈ పిక్ ఐపీస్ట్ గా మారిపోయింది. బికినీ లో త‌మ‌న్నా అందాల ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

టెంప్టింగ్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది. టూపీస్ బికినీ లు త‌మ‌న్నాకి కొత్తేం కాదు. గ‌తంలో చాలాసార్లు స్విమ్ షూట్ల‌లో అందాలు వ‌డ్డి వార్చింది. కానీ ఈసారి పింక్ కల‌ర్ లో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది.

కియారా అద్వాణీ..దిశా ప‌టానీ..అలియాభ‌ట్..సోన‌మ్ క‌పూర్ నిధి అగ‌ర్వాల్ లాంటి భామ‌లు ఇటీవ‌ల పింక్ రంగు టూపీస్ లో మంట‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ మంట‌లు క‌న్నా తాజాగా త‌మ‌న్నా సెగ‌లు మ‌రింత స‌ల‌ప‌రం పుట్టిస్తున్నాయి.

ఇక త‌మ‌న్నా సినిమాల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో మ‌ళ్లీ బ్యూటీ వేగం పుంజుకుంటుంది. ప్ర‌స్తుతం తెలుగులో `ఎఫ్ -2`కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న `ఎఫ్‌-3`లో న‌టిస్తోంది. అలాగే `గుర్తుందా శీతాకాలంలో` నూ హీరోయిన్ గా న‌టిస్తోంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన `గని` లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇస్తోంది.

ఇవిగాక మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `భోళా శంక‌ర్` లోనూ త‌మ‌న్నాని తీసుకున్నారు. `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` లో న‌టించింది. కానీ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కి నోచుకోలేదు. ఇక బాలీవుడ్ లో `బోల్ చుడాయాన్`.. `ప్లాన్ ఏ ప్లాన్ బి`..`బాబ్లీ బౌన్స‌ర్` లో న‌టిస్తోంది.