Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టైమ్ ప్ర‌య‌త్నం క‌లిసి రావాలి ఫ్రెండూ..!

By:  Tupaki Desk   |   25 March 2021 7:30 AM GMT
ఫోటో స్టోరి: టైమ్ ప్ర‌య‌త్నం క‌లిసి రావాలి ఫ్రెండూ..!
X
లైఫ్ లో అనుకున్న‌ది సాధించాలంటే ప్ర‌తిదీ క‌లిసి రావాలి. టైమ్ కుద‌రాలి. ల‌క్ చిక్కాలి. లేదంటే ఆశించిన‌ది ఏదీ వెంట రాదు. అయితే అలా త‌న‌కు టైమ్ క‌లిసి రావ‌డం వ‌ల్ల‌నే వెండితెర క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటోంది తేజ‌స్వి మాదివాడ‌. ఐస్ క్రీమ్ చిత్రంతో ఆర్జీవీ త‌న‌ను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేసాక అడ‌పాద‌డ‌పా ఆఫ‌ర్ల‌కు కొద‌వేమీ లేదు.

అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు రాక‌పోయినా న‌టిగా త‌న‌కు కెరీర్ ప‌ర‌మైన ఇబ్బందులేవీ లేవు. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాల్లో త‌న ఫాలోయింగ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. తాజాగా తేజ‌స్వి ఇన్ స్టా వేదిక‌గా లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది.

ప్ర‌య‌త్నానికి కాలం క‌లిసి రావాలి ఫ్రెండూ..? అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది ఈ బ్యూటీ. క్యాప్ష‌న్ బావుంది. అలాగే తేజస్వి అల్ట్రా స్టైలిష్ లుక్ వైర‌ల్ గా మారింది. మ‌రోవైపు తేజస్వి మాడివాడ నూతన సంవత్సరం ప్రారంభం నుండి ప్రకృతి పై ప్ర‌త్యేక ప్రేమ క‌న‌బ‌ర‌చ‌డం ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ఆన్ లొకేష‌న్ నుంచి ఈ భామ చిట్ చాట్ లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని తెలిపారు. ``నేను ప్రస్తుతం కూర్గ్ లోని మాసినగుడిలో ఉంటున్నాను. నా సినిమా షూటింగ్ కోసం వచ్చాను. నిజానికి గత మూడు నెలలుగా నేను అడవిలో ఉంటున్నాను. అడ‌వి నా ఇల్లు అయింది. నేను స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నాను. పచ్చని అడవులను చూస్తుంటే పునరుజ్జీవం అనిపిస్తోంది`` అని తెలిపింది. అడ‌వి నేప‌థ్యంలో చ‌క్క‌ని సందేశాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నాన‌ని తేజ‌స్వి వెల్ల‌డించింది. ఇటీవ‌ల లాక్ డౌన్ అనంత‌రం ఒంట‌రి ప్ర‌యాణాల‌కు అల‌వాటు ప‌డ్డాన‌ని జ‌నం కూడా అలానే ప్ర‌యాణిస్తున్నార‌ని కూడా తేజస్వి వెల్ల‌డించారు. ఇక ఈ బ్యూటీ న‌టించిన క‌మిట్ మెంట్ రిలీజ్ కి రావాల్సి ఉంది.