Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆలియా ఏంది ఈ లొల్లి?

By:  Tupaki Desk   |   5 Dec 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: ఆలియా ఏంది ఈ లొల్లి?
X
పొట్టి నిక్క‌రు చిల్లు బుగ్గ‌లు .. ఈ కాంబినేష‌న్ కి ఉండే క్రేజు వేరు! ఆలియా ఇందుకు ప‌ర్ఫెక్ట్ సూట‌బుల్. న‌వ్వితే చిల్లు బుగ్గ‌లు ఎంతో అందంగా క‌నిపిస్తాయి. దానికి కాంబినేష‌న్ గా చినుగుల నిక్క‌ర్లు చిట్టి పొట్టి నిక్క‌ర్లు ధ‌రించి ఆలియా జాలియా అనేంత‌గా చెల‌రేగిపోతుంది.

తాజాగా ఈ బ్యూటీ పొట్టి నిక్క‌రుపై ఓ స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్ ని ధ‌రించింది. బ్లూ అండ్ డార్క్ బ్లూ డిజైన‌ర్ జెరీ టాప్ తో అద‌ర‌గొట్టింది ఆలియా. జెరీ బార్డ‌ర్ దానిపైన‌.. దీప‌పు ప్ర‌మిద‌ల‌తో ఎంతో ట్రెడిష‌న‌ల్ అనిపించినా ఇదో ట్రెండీ డిజైన్ గా ఆక‌ర్షిస్తోంది.

మొత్తానికి ఆలియా ఏంటిదీ? అని యూత్ కొంత క‌న్ఫ్యూజ్ అవుతున్నా.. ప్ర‌తి ఎంపిక‌లో త‌ను యూనిక్ అని నిరూపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ - బ్ర‌హ్మాస్త్ర‌- గంగూభాయి క‌తియావాడీ లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తోంది ఆలియా. ఇవ‌న్నీ త‌దుప‌రి రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి.