Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : మేకప్‌ లేకున్నా క్యూట్‌ గానే ఉంది

By:  Tupaki Desk   |   22 March 2020 6:04 PM GMT
ఫొటోటాక్‌ : మేకప్‌ లేకున్నా క్యూట్‌ గానే ఉంది
X
చాలా మంది హీరోయిన్స్‌ ను మనం కేవలం మేకప్‌ ఉన్నప్పుడు మాత్రమే చూడగలం. మేకప్‌ లేకుండా కొందరు హీరోయిన్స్‌ బయటకు వచ్చేందుకు కూడా సాహసించరు. ఎలాంటి కార్యక్రమం అయినా.. ఏ కార్యక్రమం అయినా కూడా మేకప్‌ లేకుండా మాత్రం బయటకు రావడం కాని.. మేకప్‌ లేని ఫొటోలు పెట్టే సాహసం కాని కొందరు హీరోయిన్స్‌ చేయరు. కాని కొందరు హీరోయిన్స్‌ మాత్రం నాచురల్‌ బ్యూటీ అనిపించుకుంటూ ఉంటారు.

వారు మేకప్‌ ఉన్నా లేకున్నా కూడా క్యూట్‌ గానే కనిపిస్తూ ఉంటారు. ఈ జాబితాకు చెందిన ముద్దుగుమ్మ ఆలియా భట్‌. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. అయితే సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అది వేరే విషయం అనుకోండి. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తాజాగా ఆలియా భట్‌ తన మేకప్‌ లేని ఫొటోను షేర్‌ చేసింది. మేకప్‌ లేకున్నా కూడా తెల్లగా క్యూట్‌ గా ఆలియా ఉంది అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఆలియా భట్‌ ఇంత క్యూట్‌ గా ఉంటుంది కనుకే ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ అంటున్నారు. రణబీర్‌ కపూర్‌ తో రిలేషన్‌ లో ఉన్న ఈ అమ్మడు ఈమద్యే అతడికి బ్రేకప్‌ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.