Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : వైట్ డ్రస్ లో ఏంజిల్ లా మెరిసిన అందం

By:  Tupaki Desk   |   13 April 2022 11:30 PM GMT
ఫోటోటాక్ : వైట్ డ్రస్ లో ఏంజిల్ లా మెరిసిన అందం
X
సోషల్‌ మీడియాలో హీరోయిన్స్‌ ఫోటో షూట్స్ మరియు రెగ్యులర్‌ హాట్ ఫోటో లు వైరల్‌ అవ్వడం ఈమద్య కాలంలో చాలా కామన్ గా జరుగుతుంది. సెలబ్రెటీ గుర్తింపు ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి మరియు హీరోయిన్ ల ఫోటోలకు మరియు వీడియో లకు ఇన్ స్టా లో లక్షల్లో లైక్స్ మరియు వేలల్లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ని ఫోటోల మద్య లో కొన్ని ఫోటోలు చాలా స్పెషల్‌ గా అనిపిస్తూ ఉంటాయి.

ఔను... దివ్య ఖోస్లా కుమార్ ను తాజాగా ఇలా వైట్ డ్రస్ లో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా స్పెషల్ గా ఫీల్‌ అయ్యి ఉంటారు.

హిందీ సినిమాలతో పాటు షో లు మరియు నిర్మాతగా దర్శకురాలిగా మంచి గుర్తింపు దక్కించుకున్న దివ్య ఖోస్లా కుమార్ తాజాగా ఇలా తెల్లటి డ్రస్ లో ఏంజిల్‌ తరహా లో కనిపించి ప్రతి ఒక్కరికి కన్నుల విందు చేసింది. అబ్బుర పడే అందంతో ఈ అమ్మడు ఆకట్టుకుంది.

అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లపై ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అందమైన దివ్య ఖోస్లా కుమార్ చెప్పాంటే నటిగా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈమె నిర్మాతగా మరియు దర్శకురాలిగా కూడా కెరీర్‌ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేసి సఫలం అయ్యింది. పలు రంగాల్లో తనదైన ముద్రను వేసిన ఈ అమ్మడు అందం అంటే ఇది అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ దక్కించుకుంది.

2004 సంవత్సరంలో లవ్‌ టుడే అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు వచ్చినా కూడా వచ్చిన ప్రతి ఆఫర్‌ కు ఓకే చెప్పకుండా మెల్ల మెల్లగా కెరీర్ లో ముందుకు సాగింది.

2014 లో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు తెరకెక్కించింది. ప్రస్తుతం నిర్మాతగా ఫుల్‌ స్వింగ్‌ లో ఉంది. వెబ్‌ సిరీస్ లు మొదలుకుని పలు రకాల ప్రాజెక్ట్‌ లను ఈమె నిర్మిస్తుంది.