Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : లాక్ డౌన్ ను ఇలా ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్
By: Tupaki Desk | 27 March 2020 9:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా భయంకరంగా విస్తరిస్తున్న ఈ సమయంలో ఇండియాలో పూర్తిగా లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరాలకు మినహా ఎవరు కూడా బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో తమ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు బిజీ బిజీగా గడిపే సెలబ్రెటీలు ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి తమ ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేస్తున్నారు.
టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ ఇంకా అతడి ప్రేయసి నటాషాలు ఈ ఫొటోను షేర్ చేశారు. కొన్ని నెలల క్రితం వీరిద్దరికి వివాహ నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే. పెళ్లి కూడా త్వరలో అనుకుంటూ ఉండగా ఇలా కరోనాతో అంతా ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా హడావుడి లేకుంటే ఈ పాటికి క్రికెట్ తో బిజీ బిజీగా హార్ధిక్ సినిమాలతో నటాషా బిజీగా ఉండేవారు. కాని ఇప్పుడు వారికి మంచి టైం దొరికింది. ఇద్దరు కూడా తమ ప్రేమను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నటాషా ఈ ఫొటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్ పెట్టింది. ప్రతి సెలబ్రెటీ కూడా సోషల్ మీడియా ద్వారా స్టే ఎట్ హోమ్ అంటూ సూచిస్తున్నారు. అయితే నటాషా మాత్రం హార్ధిక్ ఒడిలో పడుకుని అతడి ప్రేమను పొందుతూ ఉన్న ఫొటోను పెట్టి మరీ స్టే ఎట్ హోమ్ అంటూ జనాలకు సూచించింది. దాంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.