Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బుట్టబొమ్మ అందాల దాడి

By:  Tupaki Desk   |   19 May 2022 1:30 PM GMT
ఫోటోటాక్ : బుట్టబొమ్మ అందాల దాడి
X
టాలీవుడ్‌ తో పాటు ప్రస్తుతం కోలీవుడ్‌ బాలీవుడ్‌ లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తు పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలానే ఉంది. అంతే కాకుండా ఈఅమ్మడి అందాల ఆరబోత ఫోటో షూట్స్ రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొనడం కోసం ప్రాన్స్ లో ఉన్న విషయం తెల్సిందే. అక్కడ ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది. హాలీవుడ్‌ తారలు కూడా తలుక్కుమనే అక్కడ మన పూజా హెగ్డే తన అందంతో ప్రతి ఒక్కరిని కూడా అబ్బురపర్చుతూ వావ్‌ అనేలా అందాలతో మెప్పిస్తూ ఉంది.

తాజాగా ఈ ఫోటోతో సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే హడావుడి చేస్తోంది. అందాల దాడి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా వావ్‌ అనిపించేలా ఉన్న అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే థైస్ మరియు క్లీవేజ్ షో తో అందాల దాడి చేస్తోంది.

ఆకట్టుకునే అందంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మైమరపించే విధంగా ఈ అమ్మడు మినీ స్కర్ట్‌ లో ఆకట్టుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల ఈమె నటించిన రాధేశ్యామ్‌ మరియు ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా మహేష్ బాబు తో ఒక సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది.

అంతే కాకుండా హిందీలో సల్మాన్‌ ఖాన్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మొత్తానికి పూజా హెగ్డే ప్లాప్‌ లు పడ్డా కూడా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా ఆఫర్ల తో దూసుకు పోతుంది.