Begin typing your search above and press return to search.

సోఫాలో సిగ్గులొల‌క‌బోస్తున్న ర‌కుల్!

By:  Tupaki Desk   |   31 May 2022 10:30 AM GMT
సోఫాలో సిగ్గులొల‌క‌బోస్తున్న ర‌కుల్!
X
ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు నిత్యం హాట్ హాట్ ఫోటోల‌తో ఇన్ స్టాని షేక్ చేస్తుంటుంది. చూప‌రుల్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్ లో ఆక‌ట్టుకో వ‌డం సొగ‌స‌రి ప్ర‌త్యేక‌త‌. కెరీర్ ఆరంభంలో సిగ్గులొల‌క‌బోసిన బ్యూటీ ఇప్పుడు పూర్తిగా షై అనే ప‌దానికే దూరంగా ఉంటుంది.

స్కిన్ షో..థై షో....క్లీవేజ్ అంటూ ఎప్ప‌టిక‌ప్ప‌డు యువ‌త‌లో అగ్గిరాజేస్తూనే ఉంది. ఇక స్విమ్ షూట్..టూపీస్ ల్లో ర‌కుల్ ఘాటు ఫోజుల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. మాల్దీవుల్లో మకాం వేసిందంటే ఇన్ స్టా వెడెక్కాల్సిందే. ఇటీవలి కాలంలో బాలీవుడ్ కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన నేప‌థ్యంలో మాల్దీవుల వెకేష‌న్ చాలా కామ‌న్ గా మారిపోయింది బ్యూటీకి.

మాల్దీవుల నుంచి అమ్మ‌డి హీటింగ్ మామూలుగా లేదిప్పుడు. ఇక స్టైలిష్ ఆల్ర్టా మోడ్ర‌న్ గాళ్ గానూ ర‌కుల్ ఎలివేష‌న్స్ అంతే హైలైట్. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి స్టైలిష్ యాంగిల్ లో క్యామ్ కి ఫోజులిచ్చింది. అదే స‌మ‌యంలో థై షో అంతే హైలైట్ అవుతుంది. సర్ప్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో సొగ‌స‌రి థై షోతో అద‌ర‌గొడుతుంది. డ్రెస్ మ్యాచింగ్ క‌ల‌ర్ స్లీప‌ర్స్ అంతే హైలైట్ అవుతున్నాయి.

సోఫా కొన మీద కుర్చుని అమ్మ‌డు కెమెరాకి ఫోజులిచ్చింది. హెయిర్ స‌ర్దుకుంటూ.. సిగ్గులొల‌క‌బోస్తూ యువ‌త‌లో కాక‌లు పుట్టించే ఫోటో ఇప్పుడు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో ప్రేమ్ లో ఆర్ట్ వ‌ర్క్ బాగుంది. విండో డిజైన్ ..వాల్ అన్ని ఫోటో సెష‌న్ కి ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఈఫోటో పై అభిమానులు హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ల‌వ్ ఎమోజీలు..బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో బిజీగా ఉంది. 'డాక్ట‌ర్ జీ' అనే సినిమాలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అలాగే 'ఛ‌త్ర‌వాలీ' అనే మ‌రో సినిమాలో కూడా న‌టిస్తోంది. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. 'ఎటాక్'..'ర‌న్ వే'..'థాంక్ గాడ్'..'మిష‌న్ సిండ్రాల్లా న‌టిస్తోంది'.

వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'ఇండియ‌న్ -2'లో న‌టిస్తోంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది. తెలుగులో '31 అక్టోబ‌ర్ లేడీస నైట్' లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు.