Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : బాబోయ్‌ ఈమె ఏంటీ మరీ ఇలా అయ్యింది

By:  Tupaki Desk   |   20 May 2022 12:30 AM GMT
ఫోటోటాక్‌ : బాబోయ్‌ ఈమె ఏంటీ మరీ ఇలా అయ్యింది
X
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు తెలుగు లో మంచి ఫేమ్ ఉన్న హీరోగా మారుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా షాలిని పాండేకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆమె చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో మళ్లీ ఆఫర్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అయినా కూడా షాలిని తన ప్రయత్నాలను ఆపడం లేదు.

విజయ్ దేవరకొండ అర్జున్‌ రెడ్డితో వచ్చిన స్టార్‌ డమ్ తో పాన్ ఇండియా స్టార్‌ గా దూసుకు పోతున్నాడు. కాని షాలిని పాండే మాత్రం పాపం ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అర్జున్‌ రెడ్డిలో షాలిని పాండే ఎంతో క్యూట్‌ గా అందంగా కనిపించింది. రౌడీ స్టార్‌ తో ఆమె రొమాన్స్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. కాస్త బొద్దుగా ఉన్న షాలిని భలే ఉందే అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొదటి సినిమా తర్వాత షాలిని ఇంకాస్త బరువు పెరిగింది. ఆ సమయంలోనే చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడం... ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో తన బరువు ఏమైనా కారణం అయ్యి ఉంటుందేమో అని బరువు తగ్గింది. ఆమద్య బరువు తగ్గి కనిపించిన షాలిని పాండే బాగుందే అనిపించుకుంది. కాని ఇప్పుడు మరింతగా బరువు తగ్గింది. షాలిని కొత్త లుక్ చూసి అంతా షాక్‌ అవుతున్నారు.

షాలిని కొత్త లుక్ కు ప్రశంసల కంటే కూడా కొందరు సునితంగా విమర్శిస్తున్నారు. అర్జున్‌ రెడ్డిలో ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్న షాలిని పాండే ఇలా అయ్యిందేంటీ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరీ సన్నగా అవ్వడంతో మొహంలో కళ తప్పినట్లుగా అయ్యిందంటూ స్వయంగా ఆమెను అభిమానించే వారు మరియు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు అంటున్నారు.

తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించిన విషయం తెల్సిందే. కాని ఇప్పుడు ఆమె మరీ సన్నగా అవ్వడం వల్ల వచ్చే ఆఫర్లు కూడా రాకుండా పోతాయేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి షాలిని పాండే బొద్దుగా ఉంటేనే బాగుంది.. అయినా కాస్త తగ్గితే పర్వాలేదు కాని మరీ ఇంత తగ్గితే ఏం బాగాలేదని కామెంట్స్ వస్తున్నాయి.