Begin typing your search above and press return to search.

అనుష్క అంద‌మంతా ఆ సిగ్గులోనే!

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 AM GMT
అనుష్క అంద‌మంతా ఆ సిగ్గులోనే!
X
బాలీవుడ్ న‌టి అనుష్క సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన‌ ప‌నిలేదు. ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫోటోలతో యువ‌త‌ని ఆకట్టుకుంటుంది. అవ‌సం మేర అంతే అందంగానూ అందాలు ఆర‌బోస్తుంది. తాజాగా అమ్మ‌డి కొత్త ఫోటో ఒక‌టి నెట్టింట దుమారం రేపుతోంది.

ఈ సారి గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి బ‌ధులుగా త‌న‌లో సిగ్గ‌రిని బ‌య‌ట పెట్టింది. ఇదిగో ఇలా అందంగా సిగ్గుప‌డుతూ ఓ సెల్పీ దిగి అభిమానుల‌కు షేర్ చేసింది. ఈ ఫోటోని ఉద్దేశించి చ‌క్క‌ని క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది.

'న‌డి నెత్తిన సూర్యుడు న‌న్ను ఇలా సిగ్గు ప‌డేలా చేసాడు' అని రాసుకొచ్చింది. అంటే సూర్యుడి కార‌ణంగా అనుష్క నేరుగా కెమెరా వైపు చూడ‌లేక‌పోవ‌డం.. అందుకే ఇలా త‌ల దించుకుని న‌వ్వుతూ క్యామ్ కి ఫోజు ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.

ఏదైతే నేం అనుష్క సిగ్గు ప‌డితే ఇంత అందంగా ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా రుజువైంది. అనుష్క‌లో సిగ్గ‌రిని బ‌య‌ట‌కు తీసుకురా వ‌డం ఇదే తొలిసారి. అందుకు సూర్యుడు కార‌ణం కావ‌డం ఇంకా స్పెష‌ల్. ఆ సూర్యుడే ప్ర‌తాపం చూపించ‌క‌పోతే అనుష్క లో సిగ్గ‌రి ఇప్పుడే బ‌య‌ట ప‌డేది కాదు.

నేచుర‌ల్ గా సిగ్గు పడి ఫోజు ఇవ్వాల‌న్నా తొంద‌ర‌గా వ‌ర్కౌట్ కాదు. ఇలా అనుకోకుండా జ‌రిగితేనే ఎంతో నేచురాలిటీ బ‌య‌ట‌కు వస్తుంది. భానుడి వేడిని త‌ట్టుకునేలా నెత్తికి రౌండ్ టోపీ.. క‌ళ్లు మూసుకుని..క్యూట్ స్మైల్ తో త‌ల కింద‌కి దించుకుని ఇచ్చిన ఫోజు అంత‌ర్జాలంలో యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది.

షోల్డ‌ర్ లెస్ బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల్లో తళుక్కున మెరిస‌న నెర‌జాన అందానికి ఫిదా కానిది ఎవ‌రు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. అభిమానులు అనుష్క అందాన్ని పొగిడేస్తూ కామెంట్ల జోరు పెంచారు.

అనుష్క కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనుష్క‌ తదుపరి నటిగా బిజీ కానుంది. క్లీన్ స్లేట్ ప్రొడక్షన్స్ నుండి వైదొలిగి వేరొకరికి బాధ్యతలు అప్పగించి నటనలోకి వచ్చేసింది. ఆమె ప్రస్తుతం 'చక్ దే ఎక్స్ప్రెస్' షూటింగ్ లో ఉంది. ఇది జులన్ గోస్వామి ప్రయాణం నుండి ప్రేరణ పొందిన కథతో రూపందుతోంది.

ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అలాగే సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో సినిమాల జోరు పెంచిన‌ట్లు క‌నినిపిస్తుంది. ఇటీవ‌లే ఓ కార్పోరేట్ ఓటీటీతో టైఅప్ అవ్వ‌డంతో క్వాలిటీ కంటెంట్ ని అందించాల‌ని టార్గెట్ గా ప‌ని చేస్తుంది. మ‌రోవైపు మంచి భార్య‌గా...ఓ బిడ్డ‌కి త‌ల్లిగానూ బాధ్య‌త‌లు నెర‌వేరుస్తుంది.