Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: భూమి భ‌గ భ‌గ మ‌రుగుతోంది!

By:  Tupaki Desk   |   4 July 2022 2:53 AM GMT
ఫోటో స్టోరి: భూమి భ‌గ భ‌గ మ‌రుగుతోంది!
X
వేసవి తాపానికి భూమి మ‌రుగుతోంది. ఓజోన్ పొర‌కు చిల్లు ప‌డిన‌ప్ప‌టి నుంచి అడ‌వులు త‌గ‌ల‌బ‌డుతున్నాయి. మనిషి ఆకృత్యానికి ప్ర‌కృతి విల‌యాలు సంభ‌విస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో భూమి మ‌ర‌గ‌డం చాలా స‌హ‌జం.

కానీ ఇక్కడ భూమి మ‌రో ర‌కంగా మ‌రుగుతోంది. కుర్ర‌కారు గుండెల్ని మ‌రిగిస్తోంది. రెడ్ హాట్ బికినీ షోతో బాలీవుడ్ అందాల న‌టి భూమి పెడ్నేక‌ర్ గుబులు రేపుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో దుమారం సృష్టిస్తున్నాయి. భూమి నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ అంటూ యూత్ ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

అయితే భూమి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లపై కాంపిటీట‌ర్ హుమా ఖురేషి స్పందించింది. అంతేకాదు ఇది 'కాపీ క్యాట్' లుక్ అంటూ విమ‌ర్శించింది. దీనిపై భూమి పెడ్నేకర్ తిరిగి స్పందించింది.

నటి హుమా ఖురేషి తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలాంటి భంగిమ తాలూకా స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ.. సేమ్‌ క్యాప్షన్ తో ఫోటోల‌ను పోస్ట్ చేసిందంటూ భూమి పెడ్నేకర్ ను విమ‌ర్శించింది. దానికి సింపుల్ గా హార్ట్ ఈమోజీతో రిప్ల‌య్ ఇచ్చింది భూమి.

అంతేకాదు.. ఇన్ స్టాలో భూమి  ఫోటోషూట్ నుండి వ‌రుస‌గా ర‌క‌ర‌కాల ఫోటోలను పంచుకుంది. ఫోటోలలో భూమి ఆరెంజ్ బికినీ టాప్ మ్యాచింగ్ ప్యాంటు ధరించి ప్రింటెడ్ షర్టుతో క‌నిపించింది. హ్యూమా షేర్ చేసిన ఫోటోలోని భంగిమ‌.. భూమి షేర్ చేసిన ఫోటోషూట్ భంగిమ‌లు ఇంచుమించు ఒకేలా ఉండ‌డంతో వీటిపై నెటిజ‌నుల్లో డిబేట్లు మొద‌ల‌య్యాయి. మొత్తానికి ఆ ఇద్ద‌రూ ఎంతో తెలివిగా నెటిజ‌నుల్లో ప్ర‌చారం చేసుకున్నారు.

భూమి పెడ్నేక‌ర్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీ బిజీ. విక్కీ కౌశల్ -కియారా అద్వానీతో పాటు 'గోవింద నామ్ మేరా' సహా పలు చిత్రాల్లో న‌టిస్తోంది. త‌దుప‌రి 'రక్షా బంధన్' మూవీలో కూడా అభిమానులు అక్షయ్ కుమార్ స‌ర‌స‌న‌ భూమిని చూస్తారు. ఆనంద్. ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమి పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది.  హిమాన్షు శర్మ - కనికా ధిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు సుధీర్ మిశ్రాతో 'అఫ్వా' అనే చిత్రాన్ని చేస్తోంది.  అర్జున్ కపూర్ తో కలిసి అజయ్ బహ్ల్ 'ది లేడీ కిల్లర్‌'లో కూడా నటించనుంది. భీద్ - భక్షక్ త‌దిత‌ర చిత్రాల‌కు సంత‌కాలు చేసింది.