Begin typing your search above and press return to search.

మిర‌ర్ లో ఆ మంట‌లేంటి బ్యూటీ!

By:  Tupaki Desk   |   15 Jun 2022 7:42 AM GMT
మిర‌ర్ లో ఆ మంట‌లేంటి బ్యూటీ!
X
దిశా ప‌టానీ టెంప్టింగ్ ఫోజుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యువ‌త‌లో నిత్యం అమ్మ‌డి హాట్ ఫోజులు హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. డిజైన‌ర్ స‌హా ఆల్ర్టా మోడ్ర‌న్ బ్యూటీగాను అమ్మ‌డు అగ్గి రాజేస్తుంది. తాజాగా మిర్ర‌ర్ సెల్పీలో అంత‌కు మంచి అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టిస్తుంది.

లో దుస్తుల్లో ఎద అందాల ఆర‌బోత‌తో మ‌రోసారి ఇలా మిర్ర‌ర్ ముందు ఓ సెల్పీ దిగి నెట్టింట దుమారం రేపుతోంది. బ్లాక్ క‌ల‌ర్ పీస్ లో...రెడ్ క‌ల‌ర్ ప్యాంట్ లో ఎద అందాల దాడి ఓవైపు అయితే..నాభి అందాల షో మ‌రోవైపు యువ‌త‌లో చ‌ర్చ‌కు దారి తీసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్ల‌తో విరుచుకు ప‌డ‌టం అంతే ఆస‌క్తిక‌రం. ఇలాంటి అందాల దాడి బ్యూటీకి కొత్తేం కాదు. అయితే ఈసారి ఇంకాస్త గ్లామ‌ర్ డోస్ పెంచిన‌ట్లు మిర‌ర్ సెల్పీ హైలైట్ చేస్తుంది.

అమ్మ‌డిలో ఈ హాట్ ఎటాకింగ్ మ‌రోసారి టాలీవుడ్ లో అవ‌కాశాల‌కు బాట వేస్తుంద‌ని తెలుస్తుంది. 'లోఫ‌ర్' త‌ర్వాత టాలీవుడ్ కి దూర‌మైన దిశ అటుపై బాలీవుడ్ లో బిజీ అయింది. మ‌ళ్లీ కొంత గ్యాప్ అనంత‌రం పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ -కె'లో న‌టించే అరుదైన అవ‌కాశం ఒడిసిప‌ట్టుకుంది.

ఇందులో ప్ర‌ధాన నాయిక‌గా దీపికా ప‌దుకొణే న‌టిస్తున్న దిశ పాత్ర కి సైతం అంతే ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తుంది. దిశ‌లో యాక్టింగ్ ట్యాలెంట్ మెచ్చి యంగ్ మేక‌ర్ నాగ అశ్విన్ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తుంది.

మ‌రి 'ప్రాజెక్ట్ కె'లో ఎలాంటి పుర్పార్మెన్స్ తో మెప్పిస్తుందో చూద్దాం. ప్రాజెక్ట్ -కె ఆఫ‌ర్ నేప‌థ్యంలో టాలీవుడ్ లో అమ్మ‌డి పేరు మ‌రోసారి డిస్క‌ష‌న్ కి వ‌స్తుంది. ప్రాజెక్ట్ -కె రిలీజ్ కి ముందే మ‌రిన్ని తెలుగు ఛాన్సులు ఒడిసిప‌ట్టుకుంటుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వస్తున్నాయి. మ‌రి వాటిని ఎంత వ‌రకూ రుజువు చేస్తుందో చూద్దాం.

ఇక బాలీవుడ్ కెరీర్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ధోని సినిమా నుంచి రాధే వ‌ర‌కూ బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం అక్క‌డ చేతిలో 'ఏక్ విల‌న్ రిట‌ర్న్స్'..'యోధ‌'..'టీనా' చిత్రాలున్నాయి. కొత్త ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్న‌ట్లు స‌మాచారం.