Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బ్లాక్‌ అండ్ వైట్ లోనూ గ్లామర్ విధ్వంసం

By:  Tupaki Desk   |   8 Jun 2022 10:30 AM GMT
ఫోటోటాక్ : బ్లాక్‌ అండ్ వైట్ లోనూ గ్లామర్ విధ్వంసం
X
తమిళంలో సూపర్‌ స్టార్స్ రజినీకాంత్‌ మరియు విజయ్‌ ల సినిమాల్లో నటించినా కూడా మాళవిక మోహనన్ ఇంకా ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సి వస్తుంది. హీరోయిన్ గా తెలుగు లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకున్నా సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలతో చాలా పాపులారిటీని దక్కించుకుంది. అందాల విందు లో బాలీవుడ్‌ హీరోయిన్స్ కూడా ఈమె ముందు దిగదుడుపే అన్నట్లుగా పేరు దక్కించుకుంది.

తాజాగా మరోసారి మాళవిక మోహనన్ తన అందాల జాతర చేసింది. ఈసారి కలర్‌ ఫుల్‌ గా వస్తే కుర్రాళ్ల కళ్లు పేళిపోతాయేమో అనుకుంది కావచ్చు అందుకే ఇలా బ్లాక్ అండ్‌ వైట్ లో సందడి చేసింది.

అమ్మడి అందాల ఆరబోత విషయంలో హద్దులు అనేవి ఎప్పుడూ ఉండవు అని ఈ ఫోటోతో మరోసారి నిరూపించింది. టాప్ లెస్ అన్నట్లుగా క్లీ వేజ్‌ షో చేస్తూ.. థైస్ ను సాధ్యం అయినంతగా ఎక్స్ పోజ్ చేసింది.

అందాల ఆరబోత విషయంలో మాళవిక మోహనన్ నెక్ట్స్‌ లెవల్‌ కు రీచ్ అయ్యింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అమ్మడి అందాన్ని ఆస్వాదిస్తూ సోషల్‌ మీడియాలో జనాలు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఉన్న మాళవిక మోహనన్‌ ఎలాంటి డ్రస్ లో అయినా.. ఔట్‌ ఫిట్‌ లో అయినా కూడా వావ్‌ అనేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

చీర కట్టు మొదలుకుని బికినీ వరకు ప్రతి ఒక్క కాస్ట్యూమ్‌ లో కూడా కన్నుల విందు కు సరైన అర్థం అన్నట్లుగా ఈ అమ్మడు ఆకట్టుకుంటుంది. అందమైన ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్‌ లోనే ఇంతగా ఆకట్టుకుంటే ఇదే ఫోటో కలర్‌ లో షేర్ చేసి ఉంటే ఎలా ఉండేదో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తమిళంలో ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలో తెలుగు లో ఒక సినిమాను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందబోతున్న రాజా డీలక్స్ సినిమాలో ఈ అమ్మడు నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.