Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : టాలీవుడ్‌ స్టార్ కిడ్ అందాలు బాలీవుడ్ ని మించి..!

By:  Tupaki Desk   |   11 July 2022 9:50 AM GMT
పిక్ టాక్ : టాలీవుడ్‌ స్టార్ కిడ్ అందాలు బాలీవుడ్ ని మించి..!
X
బాలీవుడ్ స్టార్‌ హీరోల కూతుర్లు పలువురు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. వారిలో చాలా మంది బాలీవుడ్ ను ఏలేస్తున్నారు. కాని సౌత్‌ లో మాత్రం స్టార్‌ హీరోల కుమార్తెలు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వేళ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా వారికి దక్కుతున్న ఆధరణ చాలా తక్కువ.

కమల్‌ హాసన్ కూతురు శృతి హాసన్ తప్ప సౌత్ నుండి మళ్లీ ఎవరు కూడా స్టార్స్ గా పేరు దక్కించుకున్న దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సీనియర్‌ తెలుగు స్టార్‌ హీరో రాజశేఖర్‌ ఇద్దరు కుమార్తెలు శివాని మరియు శివాత్మికలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి.. తెలుగు మరియు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కమర్షియల్‌ హీరోయిన్‌ లుగా పేరు దక్కించుకునేందుకు ఉత్తరాది ముద్దుగుమ్మల మాదిరిగా అందాల ఆరబోత విషయంలో ఈ స్టార్ కిడ్స్ వెనకాడటం లేదు.

హీరోయిన్‌ లుగా అవసరం మేరకు స్కిన్‌ షో చేసేందుకు వీరిద్దరు రెడీ అంటున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో వీరిద్దరి ఫోటోలు ఈమద్య కాలంలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా చిన్నమ్మాయి శివాత్మిక రాజశేఖర్‌ షేర్ చేసిన ఫోటోలు కుర్రకారులో హీట్ పెంచుతున్నాయి. శివాత్మిక ఈమద్య కాలంలో అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్‌ స్టార్స్ ను సైతం మించుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్‌ ను షేర్ చేయడం ద్వారా కుర్రకారు కు మతులు పోగొట్టింది.

ఇక శివాత్మిక హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత కూడా రెండు మూడు సినిమా లకు ఈమె కమిట్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే తమిళంలో కూడా ఈ అమ్మడి సినిమా లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి.