Begin typing your search above and press return to search.

వాచిన క‌నురెప్ప‌లు గండు చీమ కొరికిన పెద‌వులు

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:49 AM GMT
వాచిన క‌నురెప్ప‌లు గండు చీమ కొరికిన పెద‌వులు
X
పర్ఫెక్ట్ సెల్ఫీల ప్రపంచంలో ఉబ్బిన పెదవులు వాచిన క‌నురెప్ప‌ల‌తో శృతి హాసన్ బిగ్ షాకిచ్చింది. సోషల్ మీడియాలో త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించింది శ్రుతి. మ‌రింత‌గా డీటెయిల్స్ లోకి వెళితే..

ఫిల్టర్ లేని జీవితాన్ని గ‌డ‌ప‌డం కొంద‌రికి మాత్ర‌మే సాధ్యం. ప్ర‌తిదీ బోల్డ్ గా ఓపెన‌ప్ అయిపోవ‌డం అన్న‌ది అంద‌రికీ మ‌న‌స్క‌రించ‌నిది. కానీ శ్రుతిహాస‌న్ అందుకు పూర్తి విరుద్ధం. త‌న జీవితంలో ప్ర‌తి కాంప్లికేష‌న్ గురించి బ‌హిరంగంగా మాట్లాడే ధైర్య‌శాలి. త‌న‌కు న‌చ్చిన చెలికాడు మైఖేలో కోర్స‌లేను నేరుగా త‌న త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేసింది. కానీ ఆ సంబంధం వీగిపోయాక డూడుల్ ఆర్టిస్టు శంత‌ను హ‌జారికాతో స‌హ‌జీవనం విష‌యంలోనూ ఏదీ దాచ‌లేదు. శ్రుతి జీవితం అభిమానుల‌తో పాటు అంద‌రికీ ఒక‌ తెరిచి ఉంచిన పుస్త‌కం.

ఈ పుస్త‌కంలో ఒక్కో పేజీ ఎంతో విచిత్ర‌మైన ర‌హ‌స్యాల‌ను ప్ర‌పంచానికి ఆవిష్క‌రిస్తున్నాయి. తాజాగా శ్రుతిహాసన్ మేక‌ప్ లెస్ రూపం సెల్ఫీల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక ఈ సెల్ఫీల్లో పిచ్చి పిచ్చిగా గ‌జిబిజిగా ఉన్న ఫోటోలు చూడ‌గానే అభిమానులంతా షాక‌వుతున్నారు.

ముఖ్యంగా మేక‌ప్ లెస్ ఫేస్ లో గ్లో పూర్తిగా మిస్స‌యింది. ఒరిజిన‌ల్ రూపం పూర్తిగా పాలిపోయిన‌ట్టుగా ఉంది. పైగా రాత్రి అంతా నిదురపోక‌పోతే ఉబ్బిపోయే తీరుగా ఆ క‌ను రెప్ప‌లు ఉబ్బుగా క‌నిపిస్తున్నాయి. అంతేకాదు.. ఆ పెద‌వుల‌ను గండుచీమ‌లు కొరికిన‌ట్టు ఉబ్బి దొడ్డుగా క‌నిపిస్తున్నాయి. ఇక త‌న కళ్ల‌లో ఎరుపు న‌లుపు చార‌లు స్ప‌ష్టంగా ఈ సెల్ఫీలో క‌నిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే శ్రుతిహాస‌న్ జీవితంలో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా? అనిపించేంత‌గా ఆ సెల్ఫీల‌లో క‌నిపించింది. నిజానికి ఈ రూపం షాకిచ్చేదే.

కానీ శ్రుతిహాస‌న్ ఇండ‌స్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్ గా కెరీర్ ని సాగిస్తోంది. నిరంత‌ర ప్ర‌యాణాల‌తో అల‌స‌ట వ‌ల్ల త‌న రూపం అంత‌గా మారిపోయిందా? అనే సందేహాలు క‌ల‌గ‌క‌పోవు. ఇక శ్రుతి పొగ తాగే అలవాటు గురించి ఆల్క‌హాలిక్ హ్యాబిట్ గురించి ఇప్ప‌టికే బ‌హిరంగంగానే అంగీక‌రించింది. మైఖేల్ కోర్స‌లే నుంచి బ్రేక‌ప్ అయ్యాక ఆ డిప్రెష‌న్ నుంచి కోలుకునేందుకే చాలా స‌మ‌యం ప‌ట్టింది.

శ్రుతి హాసన్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన బోల్డ్ నటిగా కెరీర్ ని సాగిస్తోంది. సోషల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఎప్పుడూ దాచ‌కుండా బ‌హిర్గ‌తం చేస్తూనే ఉంది. నిజానికి దీనికి గ‌ట్స్ కూడా ఉండాలి. త‌న‌ రోజువారీ అప్ డేట్స్ పై తరచుగా అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తుంటారు. ఇన్ స్టా వేదిక‌గా మేకప్ లెస్ ఫోటోలు...మ్యూజిక్.. వర్కౌట్ వీడియోలు.. పెట్ క్లారా ఫోటోల‌ను షేర్ చేస్తుంది. ప్రియుడు హజారికా శాంతానుతో హాయిగా గడిపే క్షణాలను కూడా ఓపెన్ గానే షేర్ చేస్తోంది. నేటిత‌రం నాయిక‌ల్లో శ్రుతి ఫిల్టర్ లేని జీవితాన్ని గడుపుతుంది. త‌న హృదయం ప్రతిదీ మాట్లాడుతుంది. తాజాగా తన తాజా ఇన్ స్టాలో పరిపూర్ణ సెల్ఫీలతో ఏదీ దాచుకోకుండా ఓపెనైంది.

పర్ఫెక్ట్ సెల్ఫీల ప్రపంచంలో శృతి తన ఉబ్బిన పెదవులు.. పాలిపోయిన ముఖం.. చెదిరిన‌ జుట్టు .. తిమ్మిరితో బాధ‌ప‌డిన‌ రోజులను చూపించే కొన్ని త్రోబ్యాక్ ఫోటోలు ఇటీవ‌ల షేర్ చేసింది. శ్రుతి అలసిపోయినట్లుగా అనారోగ్యంతో ఉన్న ఫోటోలను షేర్ చేసి వాస్త‌వాల‌ను కూడా వెల్ల‌డించింది. ''ప‌ర్ఫెక్ట్ సెల్ఫీలు .. పోస్ట్ ల ప్రపంచంలో ఫైనల్ కట్ కి చేరుకోనివి ఇక్కడ ఉన్నాయి. బాడ్ హెయిర్ డే .. ఫీవర్ .. సైనస్ తో ఉబ్బిన రోజు ... పీరియడ్స్ క్రాంప్ డే ఇంకా చాలా.. ఫోటోలు ఉన్నాయి'' అంటూ బోల్డ్ గా ఉన్న విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. ''మీరు కూడా వీటిని ఆనందిస్తారని ఆశిస్తున్నాను'' అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ సాహసోపేతమైన చర్యపై అభిమానులు ప్రశంస‌లు కురిపిస్తున్నారు. ఇలా ఫిల్ట‌ర్ లెస్ గా జీవించడం అంద‌రికీ సాధ్య‌ప‌డ‌నిది అంటూ పొగిడేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

స‌ర్జ‌రీల వ‌ల్ల‌నే ఇలా అయ్యిందా?

శృతి హాసన్ కాస్మెటిక్ సర్జరీలు PCOS గురించి ఓపెన్ గా మాట్లాడ‌డం కూడా ఇదే మొద‌టి సారి కాదు. శృతి తనలోని మ‌రో కోణాన్ని చూపించడం ఇదే తొలిసారి కాదు. 2020 మార్చి 2న శ్రుతి హాసన్ తన పెదవుల‌ మెరుగుదల కోసం ముక్కు అందం పెంచుకోవ‌డం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు అంగీకరించింది. త‌న అందంలో మార్పున‌కు సంబంధించిన అంత‌కు ముందు ఫోటోతో తరువాత ఫోటోను జ‌త చేసి షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన నోట్ ని రాసింది. తాను ప్లాస్టిక్ సర్జరీని ప్రోత్సహించనని చెప్పింది. అయితే అదే సమయంలో ప్రజలు తమ రూపాన్ని మార్చుకున్నందుకు విమర్శించకూడదని కోరింది. ఈ సంవత్సరం జూన్ లో శ్రుతి హాసన్ తనకు పిసిఒఎస్ స‌మ‌స్య‌ ఉందని దీనిపై పోరాడుతున్నాన‌ని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓపెనైంది.

త‌దుప‌రి ప్రాజెక్ట్ లు

న‌ట‌సింహా బాల‌కృష్ణ స‌ర‌స‌న 'వీరసింహా రెడ్డి'.. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న 'వాల్తేరు వీరయ్య'లో న‌టిస్తోంది. ఇవి రెండూ 2023 సంక్రాంతి (పొంగల్‌) బ‌రిలో విడుదల కానున్నాయి. వీటితో పాటు ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ స‌లార్ లోను శ్రుతి న‌టిస్తోంది.

ఇక సంక్రాంతి బ‌రిలో రానున్న రెండు సినిమాలు నువ్వా నేనా? అంటూ ఢీకి రెడీ అవుతుండగా రెండు సినిమాల్లో శ్రుతి న‌టించ‌డం విశేషం. ఇరువురు 60 ప్ల‌స్ ఏజ్ హీరోల స‌ర‌స‌న 30 ప్ల‌స్ శ్రుతి ఎలా క‌నిపించ‌బోతోంది? అన్న‌ది కూడా చ‌ర్చ‌గా మారింది. ఇదిలా ఉంటే శ్రుతిహాస‌న్ స‌లార్ లాంటి క్రేజీ చిత్రంలో న‌టిస్తూ ప్ర‌భాస్ అభిమానుల‌కు ద‌గ్గ‌రైపోయింది. అలాగే ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'దే ఐ'లో కూడా ప్ర‌ధాన పాత్రను పోషిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.