Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : పెళ్లికి సిద్దమైన అందాల విందులో తగ్గేదేలే

By:  Tupaki Desk   |   1 Jun 2022 6:14 AM GMT
ఫోటోటాక్ : పెళ్లికి సిద్దమైన అందాల విందులో తగ్గేదేలే
X
సోనారికా భడోరియా... ఈ పేరు చెప్పగానే ఆమె గుర్తుకు రాకపోవచ్చు కాని ఉత్తరాది ప్రేక్షకులకు మహాదేవ్ సీరియల్‌ లో పార్వతి అనగానే ఠక్కున గుర్తుకు వస్తుంది. తెలుగు లో కూడా మహాదేవ్‌ సీరియల్ తో చాలా మంది ప్రేక్షకులకు సుపరిచితురాలు గా మారిన హీరోయిన్ సోనారికా భడోరియా. సీరియల్స్ నుండి సినిమాల్లోకి జంప్ అయిన సోనారికా భడోరియా కి ఆశించిన స్థాయిలో టాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కలేదు.

తెలుగు లో ఈ అమ్మడు జాదూగాడు.. స్పీడున్నోడు... ఈడో రకం వాడో రకం సినిమాల్లో నటించింది. మూడుకు మూడు సినిమాలు కూడా నిరాశ పరిచాయి. దాంతో బాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసి అలసి పోయినట్లుగా ఉంది. సినిమాల్లో ఛాన్స్ వచ్చినా రాకున్నా కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు ఈమె హాట్‌ టాపిక్ గా ఉంటుంది.. అందుకు కారణం ఈ అమ్మడి హాట్ ఫోటోలు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల వికాస్‌ పరాసర్‌ తో ఈమె ఎంగేజ్మెంట్‌ జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అయ్యింది. పెళ్లి కి సిద్ధం అయినా కూడా అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటూ తాజాగా మరో సారి తన బికినీ ఫోటో లను ఇన్ స్టా గ్రామ్‌ ద్వారా షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

పెళ్లి అయిన తర్వాత లేదంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కాస్త అందాల ప్రదర్శణ తగ్గించడం లేదా సినిమాల్లో నటించడం తగ్గించడం గతంలో మనం చూశాం. కాని ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. పెళ్లి అయినా కూడా కెరీర్‌ కు లేదా ఇతర వ్యక్తిగత విషయాలకు పెళ్లి అడ్డు అవ్వడం లేదు. అందుకే సోనారికా భడోరియా పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్‌ అయినా కూడా బికినీ ఫోటోలు షేర్‌ చేసింది.

ఈ అమ్మడు పార్వతి దేవిగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత అందాల విందు చేయడం వల్ల చాలా మంది ఆమె పై విమర్శలు చేశారు. మహా శివుని భార్య పార్వతి దేవి పాత్రలో నటించిన నువ్వు ఇలా నటించడం ఎంత వరకు అంటూ ఆమెను కాదన్నారు.

ఫిల్మ్‌ మేకర్స్ కూడా అదే కారణంతో ఆమెను పక్కకు పెట్టారు అనేది ఒక వర్గం వారి అభిప్రాయం. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా హీరోయిన్ గా తాను సక్సెస్‌ అవుతాను అనే నమ్మకంతో సోనారికా భడోరియా ఉందట.