Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: కోతి క‌మ్మ‌చ్చి ఆడ‌క‌లా కోడ‌లా

By:  Tupaki Desk   |   29 Nov 2019 7:43 AM GMT
ఫోటో టాక్‌: కోతి క‌మ్మ‌చ్చి ఆడ‌క‌లా కోడ‌లా
X
చిన్న‌ప్పుడు కోతి క‌మ్మ‌చ్చి ఆడిన గుర్తులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. చెట్టెక్కి బెదిరించే మంకీ ఫ్రెండును మ‌ర్చిపోవ‌డం కుద‌ర‌దు. అది వెక్కిరిస్తే ఎలా ఉంటుందో తెలుసు క‌దా!! మ‌రోసారి అలాంటి మెమ‌రీని గుర్తుకు తెచ్చింది సామ్.

హ‌బ్బీ నాగ చైత‌న్య‌తో క‌లిసి షికార్ కి వెళ్లిన‌ప్ప‌టి ఫోటో ఒక‌టి షేర్ చేసిన సామ్ ఇదిగో ఇలా వెక్కిరిస్తూ ద‌ర్శ‌న‌మిచ్చింది. సామ్ ఏ వేషం వేసినా అది కొత్త‌గానే ఉంటుంది. అభిమానుల‌కు న‌వ్వు ఆపుకోలేనంత ఒట్టు. అది ఏదైనా ల‌గ్జ‌రీ హోట‌ల్లో స‌న్నివేశ‌మా.. లేక ఖ‌రీదైన విల్లాలోనా? అన్న‌ది తెలీడం లేదు కానీ మొత్తానికి ఆ యాంబియెన్స్ లో హ‌బ్బీ చైతూ బ్ల‌ర్ అయ్యి క‌నిపిస్తున్నాడు. బ్లాక్ జ‌ర్కిన్ లో క్రిస్టోఫ‌ర్ నోలాన్ లా ఉన్నాడు. ఇక సామ్ సింపుల్ గా టాప్ టు బాట‌మ్ బ్రాండెడ్ టీస్ ధ‌రించి క‌నిపిస్తోంది.

స‌ర‌దాగా జాలీగా ఆయ‌న‌తో క‌లిసి షికార్లు చేయ‌డ‌మేనా? ఇలా అప్పుడ‌ప్పుడు ఆట‌విడుపు కూడా అవ‌స‌ర‌మేన‌ని సామ్ చెప్ప‌క‌నే చెబుతోంది. ఇంత‌కీ ఏ ట్రిప్ లో ఈ వ్య‌వ‌హారం అంటే.. ఇటీవ‌లే అక్కినేని నాగ‌చైత‌న్య బ‌ర్త్ డే(23 న‌వంబ‌ర్) సంద‌ర్భంగా గోవా వెళ్లారు. ఆ ట్రిప్ లో ఛ‌మ‌క్కు ఈ ఫోటో. స‌మంత‌.. చైతూ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. వీలున్న ప్ర‌తిసారీ ఈ జంట ఇలాంటి షికార్ల‌తో రిలాక్స‌వుతూ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ఆ స‌ర‌దాని పంచుకుంటున్నారు.