Begin typing your search above and press return to search.

సౌతాఫ్రికా ఫ్రెండు పెళ్లిలో స్నేహ హంగామా

By:  Tupaki Desk   |   11 Nov 2022 4:28 PM GMT
సౌతాఫ్రికా ఫ్రెండు పెళ్లిలో స్నేహ హంగామా
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ మాత్రం ఛాన్స్ ద‌క్కినా ఫ్యామిలీ వెకేష‌న్ కి ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. భార్య పిల్ల‌ల‌తో సుదూర తీరంలో ఎక్కువ స‌మ‌యాన్ని ఆనందంగా గ‌డిపేందుకు అత్యంత ఆస‌క్తిగా ఉంటారు. పాన్ ఇండియా ఫిలిం `పుష్ప -1` సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత `పుష్ప 2` చిత్రీక‌ర‌ణ కోసం అత‌డు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సీక్వెల్ షూటింగ్ కి ఇంకా సమయం ఉంది. ఈలోగానే ఈ ఖాళీ స‌మ‌యాన్ని సద్వినియోగం చేసేందుకు అత‌డు అద్భుత‌మైన ప్లాన్ వేసాడు.

బన్నీ తన కుటుంబంతో కలిసి మ‌హా స‌ముద్రాల ఆవ‌ల‌ వెకేషన్ కు వెళ్లాడు. ప్రస్తుతం బన్నీ అతని కుటుంబం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. బన్నీ ఫ్రెండ్ మ్యారేజ్ సౌతాఫ్రికాలో జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో ఈ పెళ్లి వేడుక చాలా గ్రాండ్ గా జ‌రుగుతోంది. అక్క‌డ సంద‌డి అసాధార‌ణంగా ఉంద‌న‌డానికి తాజాగా లీకైన ఫోటోలే సాక్ష్యం.

ఈ వివాహ వేడుకలో బన్నీతో పాటు అతని స్నేహితులు కూడా పాల్గొన‌డం విశేషం. ఎప్పటిలాగే ఈ వేడుకలో అల్లు అర్జున్ భార్య స్నేహ హైలైట్ గా నిలిచింది. ఆమె వైట్ అండ్ వైట్ లో చాలా స్టైలిష్ గా ఆకట్టుకునేలా కనిపించారు. ముఖ్యంగా స్నేహా ట్రెండీ లుక్స్ షో స్టాప‌ర్ గా నిలిచాయంటే అతిశ‌యోక్తి కాదు. అభిమానులు ఈ ఫోటోలు చూశాక బాలీవుడ్ లో షాహిద్- మీరా జంట‌తో బ‌న్ని-స్నేహ జంట‌ను పోల్చ‌డం చాలా స‌హ‌జం. ప్ర‌స్తుతం పెళ్లి వేడుకలో స్టార్ క‌పుల్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

రష్యాలో పుష్పరాజ్ ప్రమోష‌న్ ?

ప్ర‌స్తుతం ఉక్రెయిన్ - ర‌ష్యా న‌డుమ‌ భీక‌ర యుద్ధం జ‌రుగుతుంటే... మ‌రోవైపు పుష్ప‌రాజ్ ఏకంగా అగ్ర‌రాజ్యం ర‌ష్యాలోనే అడుగు పెడతాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. `పుష్ప: ది రైజ్`తో స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ర‌ష్యా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. తాజా స‌మాచారం మేర‌కు.. డిసెంబర్ లో ఈ సినిమా రష్యాలో విడుదల కానుంది. ఆసక్తికరంగా మ‌న‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌ చిత్రాన్ని రావ‌ణ కాష్టంలా ర‌గులుతున్న‌ ఆ దేశంలో ప్రమోట్ చేయనున్నారు. అయితే చిత్ర‌బృందం నుంచి తదుపరి అధికారిక‌ ప్రకటన వెలువ‌డాల్సి ఉంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క‌ల్ట్ జానర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచింది. సుక్కూ త‌న‌దైన స్టైల్లో స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. తెలుగు - త‌మిళం స‌హా హిందీలోను పుష్ప బంప‌ర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

పుష్ప 2 విష‌యంలో త‌గ్గేదేలే..!

సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఇటీవ‌ల అల్లు అర్జున్ పై తొలి స‌న్నివేశం చిత్రీక‌రించ‌డం తో మోస్ట్ అవైటెడ్ `పుష్ప: ది రూల్` షూటింగ్ ను ప్రారంభించారు. మిరోస్లావ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో సెట్స్ నుండి ఒక ఫోటోను షేర్ చేయ‌గా ఆ విష‌యం నిర్ధార‌ణ అయ్యింది. ఈ ఫోటోలో అతను ఫ్రేమ్ లో అల్లు అర్జున్ పై షాట్ కంపోజ్ చేస్తున్నట్లు క‌నిపించింది. ``సాహసం ప్రారంభమైంది … ఐకాన్ స్టార్ కి ధన్యవాదాలు`` అని అతను క్యాప్ష‌న్ ఇచ్చాడు.

అల్లు అర్జున్ `పుష్ప: ది రైజ్` విడుదలై దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. ఇప్పటికీ పుష్ప పాట‌లు ఇందులో న‌టించిన తార‌లు ట్రెండింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు రెండవ భాగం పుష్ప: ది రూల్ లో పుష్పరాజ్ ఐకానిక్ రోల్ ఇంకెలా మారుతుందో చూడాల‌న్న ఉత్కంఠ నెల‌కొంది. త‌గ్గేదేలే! అంటూ ఈసారి రేంజును అమాంతం పెంచేందుకు సుకుమార్ టీమ్ చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుని స్క్రిప్టును రీరైట్ చేసింది. అభిమానులు ఊపిరి పీల్చుకునేందుకు ఛాన్స్ లేని గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ నేరేష‌న్ తో పార్ట్ 2 ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే జూన్ లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్ట‌కేల‌కు రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు చిత్ర‌బృందం స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలిసింది. బ్యాంకాక్- శ్రీ‌లంక అడ‌వుల్లో అరుదైన లొకేష‌న్ల‌లో పార్ట్ 2ని విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా తెర‌కెక్కించ‌నున్నారు. అలాగే బ్యాంకాక్ అడ‌వుల్లో పులితో బ‌న్ని భీక‌ర‌మైన ఫైట్ ని చిత్రీక‌రిస్తార‌ని కూడా లీక్ అందింది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 2023లో విడ‌ద‌ల‌య్యేందుకు ఛాన్సుంద‌ని టాక్ వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.