Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రౌడీ గారు షాకింగ్ లుక్

By:  Tupaki Desk   |   1 Feb 2020 5:10 AM GMT
ఫోటో స్టోరి: రౌడీ గారు షాకింగ్ లుక్
X
సోలో హీరో అయ్యాక‌.. కేవ‌లం ఐదారేళ్ల‌లోనే అసాధార‌ణ స్టార్ డ‌మ్ అందుకున్న హీరోగా దేవ‌ర‌కొండ పేరు మార్మోగుతోంది. అంత‌కుముందు స్ట్ర‌గుల్ లైఫ్ ఉన్నా.. సోలో హీరోగా తొలి అడుగుల్లోనే బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతూ స్కై వేలోకి దూసుకొచ్చేశాడు. సోష‌ల్ మీడియా డిజిట‌ల్ యుగానికి త‌గ్గ‌ట్టు రౌడీ 2.0 గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం రౌడీ బ్రాండ్ ఇంటా బ‌య‌టా మార్మోగిపోతోంది. ఇక ఇదే ఇస్పీడ్ లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఫైట‌ర్` అనేది ఈ సినిమా టైటిల్. పూరి- చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఆ క్ర‌మంలోనే పైట‌ర్ బృందంతో అత‌డు చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. దేవ‌ర‌కొండ‌ను పాన్ ఇండియా స్టార్ ని చేయ‌డ‌మే ధ్యేయంగా పూరి-చార్మి-క‌ర‌ణ్ బృందం కంక‌ణం క‌ట్టుకుంది.

ఆ క్ర‌మంలోనే సౌత్ - నార్త్ అల‌యెన్స్ తో పాన్ ఇండియా సినిమాకు స‌న్నాహాలు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లు లోక‌ల్ మార్కెట్ అనుకునేవారు.. ఇప్పుడు నేష‌న‌ల్ మార్కెట్ ని గుంజుకు రావాల్సిందేన‌న్న క‌సి పూరీలో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం పూరి - విజ‌య్ బృందం ముంబై టు హైద‌రాబాద్ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. షూటింగ్ ప‌నుల్లో భాగంగా ఇదిగో ఇలా విమానాశ్ర‌యాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

ఇంత‌కీ విజ‌య్ లుక్ ని ప‌రిశీలించారా? ఇంత‌లోనే ఎంత మార్పు? అత‌డిని నిశితంగా పరిశీలిస్తే ఫిజిక్ ప‌రంగా చాలా మార్పులే క‌నిపిస్తున్నాయి. ప‌ర్ఫెక్ట్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో బాడీని షేప‌ప్ చేసేస్తున్నాడు. ఇప్ప‌టికే ట్రైసెప్.. బైసెప్ క‌టింగ్స్ తిరిగేస్తున్నాయి. ఆ షోల్డ‌ర్ ని కూడా పైకి లేపాడు. బాడీ ఫిట్ వైట్ టీష‌ర్ట్ దేహాన్ని అతుక్కుపోయింది. ఇక ఫైట‌ర్ చిత్రంలో దేవ‌ర‌కొండ లాంగ్ హెయిర్ తో క‌నిపించ‌నున్నాడు. అందుకే ఆ హెయిర్ ని కవ‌ర్ చేసేస్తూ డెనిమ్స్ హ్యాట్ ని ధ‌రించాడు. గ‌త కొంత‌కాలంగా ముంబైలో చిత్రీక‌ర‌ణ గురించి చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే విమానాశ్ర‌యంలో స‌డెన్ గా ఇలా లుక్కిచ్చాడు దేవ‌ర‌కొండ‌.