Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అన్నయ్యకే పోటీకొస్తున్నాడు!
By: Tupaki Desk | 6 Oct 2019 5:07 AM GMTమాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వీవీ వినాయక్. 'ఆది' చిత్రంతో సీమ ఫ్యాక్షన్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. నితిన్ నుంచి చిరంజీవి వరకు ఆయన కలిసి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షాన్ని కురిపించాయి. కెమెరా వెనక వుండి బ్లాక్ బస్టర్ సినిమాలకు మార్గనిర్ధేశనం చేసిన దర్శకుడు ఇప్పడు తెరపై వెలగబోతున్నాడు. వి.వి.వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహార్షి' బ్లాక్‌బస్టర్ టాక్ విన్న తరువాత తిరుపతి వెళ్లిన దిల్ రాజు సర్ ప్రైజింగ్ న్యూస్ తో మీడియా ముందుకొచ్చారు. దర్శకుడు వి.వి.వినాయక్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నానని ప్రకటించి అందరికి షాకిచ్చారు.
ఎట్టకేలకు వినాయక్ సినిమాని ఈ నెల 9న లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. శరభ' ఫేమ్ ఎన్. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన నరసింహారావు వినాయక్ బాడీ ల్యాంగ్వేజ్ కి సరిపోయే కథని సిద్ధం చేయడం.. అది దిల్ రాజుకు నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం కోసం గత కొన్ని నెలలుగా వి.వి.వినాయక్ నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నాడు. హీరోగా రూపం మార్చుకున్నారు. మొన్నటికి మొన్న సాహో ప్రీరిలీజ్ వేదికపై.. ఆ తర్వాత సైరా ఈవెంట్లో మెరిసిన వినయ్ కొత్త లుక్ కి అంతా పరేషానయ్యారు. ఇంతలోనే ఎంత మార్పు అంటూ మాట్లాడుకున్నారు.
తాజాగా ఆయనపై స్పెషల్ ఫొటోషూట్‌ని నిర్వహించారు. తన దర్శకత్వంలో ఎందరో హీరోలకి లైఫ్ ని ఇచ్చిన వినాయక్ ఈ ఫొటో షూట్ లో హీరో లుక్ లో ఆకట్టుకుంటున్నారు. కాస్త లేటుగా హీరో అవుతున్నా.. లేటెస్టుగానే బరిలో దిగుతున్నారని అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే పరిశ్రమలో తాను ఎంతో ఆప్యాయంగా అన్నయ్యా అంటూ పిలుచుకునే మెగాస్టార్ కే లుక్కులో పోటీకొచ్చేట్టు కనిపిస్తున్నాడు. అంతగా రూపం మారిపోయింది. హీరో అంటే మజాకానా? పోలో టీషర్టు కాంబినేషన్ జీన్స్.. రెబాన్ కళ్లద్దాలు వగైరా వగైరా చూస్తుంటే వ్వావ్ అనకుండా ఉండలేరు. ఆయన ఫొటోలకు పోజులిచ్చిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.