Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : జలకాలాటలలో అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   7 April 2022 12:30 AM GMT
ఫోటోటాక్ : జలకాలాటలలో అందాల ఆరబోత
X
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కాస్త బొద్దుగా ఉన్నా కూడా అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా తగ్గలేదు. స్టార్‌ హీరోయిన్స్ దీపిక పదుకునే.. ప్రియాంక చోప్రా ఇతరులతో పోటీ పడి మరీ అందాల విందు చేసింది. సినిమాల్లోనే కాకుండా ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా కూడా తన అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జలకాలాటలలో... అన్నట్లుగా పాట పాడుతూ నీటితో ఆడుకుంటూ అందాల ఆరబోత చేస్తోంది. అందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఈ అమ్మడి ఔట్‌ ఫిట్‌ కూడా ఉంది. బికినీ వేసుకోవడం మాత్రమే కాకుండా అందుకు తగ్గట్లుగా అందంగా కనిపించడం కూడా ఒక కళ అంటూ ఉంటారు.

వల్గర్ గా కాకుండా అందంగా ఈ అమ్మడు ఈ ఫోటోలో కనిపించడంతో ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుని మరీ చూస్తున్నారు. ఈ అమ్మడు ఈమద్య కాలంలో కాస్త బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. బరవు తగ్గి మరింత అందంగా తయారు అయ్యారు అంటూ చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా సోనాక్షి సిన్హా యొక్క అందం ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు.

సముద్రం ఒడ్డున సరదాగా గడుపుతూ తీసుకున్న ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో సోనాక్షి సిన్హా గురించి మరింతగా చర్చ జరుగుతూ ఉంది. బాలీవుడ్‌ హాట్ బ్యూటీ లు ఎంత మంది ఉన్నా కూడా సోనాక్షి సిన్హా స్పెషల్‌ అన్నట్లుగా ఈ ఫోటోలతో చెప్పకనే ఆమె చెబుతుంది అంటూ అభిమానులు మరియు ఫాలోవర్స్ సోషల్‌ మీడియా ద్వారా ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే... గత ఏడాది భుజ్‌ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్‌ దేవగన్ కి జోడీగా ఆ సినిమాలో నటించింది. హీరోయిన్ గా ఈమె చేసిన సినిమాలు మరియు చేస్తున్న సినిమాలు ఈ ఏడాది వరుసగా బ్యాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

హీరోయిన్ గానే కాకుండా పాత్రకు డిమాండ్‌ ఉంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేసేందుకు ఈమె ఓకే చెప్పాలని అనుకుంటుందట. వెబ్‌ సిరీస్ లపై కూడా ఈమె ఆసక్తిగా ఉన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొత్తానికి అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.