Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : అరుదైన మెగా కలయిక

By:  Tupaki Desk   |   27 May 2021 9:30 AM GMT
ఫొటోటాక్ : అరుదైన మెగా కలయిక
X
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి ఫొటోకు ఫోజ్‌ ఇస్తే అభిమానులకు పండుగ. అలాంటిది చిరంజీవి.. చరణ్‌ మరియు పవన్‌ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌ లో ఉండటం అందులో అల్లు అరవింద్‌ కూడా కనిపించడం తో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు పుష్కర కాలంకు ముందు ఈ ఫొటో తీసి ఉంటారు. బ్రహ్మాజీ సోషల్‌ మీడియా లో షేర్‌ చేసి 'నా చిన్నతనంలో..' అంటూ ఫన్నీ కామెంట్‌ ను పెట్టాడు. ఈ ఫొటోలో రవితేజ కూడా కనిపించాడు. రాజా రవీంద్ర కూడా ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

బ్రహ్మాజీ రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో ఫన్నీ మూమెంట్స్ ను షేర్‌ చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా తన చిన్నతనంలో అంటూ ఈ ఫొటోను షేర్‌ చేశారు. ఫొటోలో కనిపిస్తున్న వారు అందరు కూడా చాలా మారిపోయారు. అల్లు అరవింద్ మొదలుకుని పవన్‌ మరియు రవితేజ వరకు అందరు కూడా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు. అప్పట్లో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో ఈ ఫొటోను తీసినట్లుగా ఉన్నారు. ఆ ఫొటో వెనుక కథను మాత్రం బ్రహ్మాజీ వెళ్లడించలేదు.