Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: చూపుల‌తోనే చంపేస్తావా?

By:  Tupaki Desk   |   24 March 2022 1:30 PM GMT
ఫోటోటాక్: చూపుల‌తోనే చంపేస్తావా?
X
తెలుగు భామ‌లు బోల్డ్ అటెంప్ట్ కి ఏమాత్రం వెనుకాడ‌టం లేదు. ముంబై భామ‌ల‌కి ధీటుగా అందాల విందు చేస్తున్నారు. డిజైన‌ర్ దుస్తుల్లో క్లీవేజ్..థై ఎలివేష‌న్స్ తో త‌మ‌లోని స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంజ‌లి..ఈషారెబ్బా..రీతువ‌ర్మ‌...లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అన‌న్య నాగ‌ల్ల వ‌ర‌కూ ఛాన్స్ దొరిక‌న‌ప్పుడుల్లా టెంప్టింగ్ ఎలివేషన్స్ కి ఏమాత్రం వెనుకడుగు వేయ‌లేదు. మ‌డి క‌ట్టుకున్న భామ‌లు సైతం ఆ ముడుల్ని విప్పేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

నిన్న మొన్నటి వరకు ఈషా రెబ్బా తన అందాలతో సోషల్ మీడియాలో జనాలను ఓ రేంజ్ లో ఆక‌ట్టుకుంది. అంతకు మరో తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల అందాల విందు చేస్తుంది. తాజాగా అన‌న్య మ‌రోసారి క్యూట్ అండ్ స్వీట్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది.

పింక్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో థై అందాల్ని ఎలివేట్ చేస్తూ చూపుల‌తోనే చంపేస్తుంది. పింక్ పై బ్లాక్ లెద‌ర్ కోట్ ధ‌రించింది. మ్యాచింగ్ షూస్ తో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. సిట్టింగ్ పోజిష‌న్ లో బ్యూటీ క్యామ్ కి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అన‌న్య ఫోటో యువ‌త‌రంలో హాట్ టాపిక్ అవుతుంది.

అన‌న్య కెరీర్ విష‌యానికి వ‌స్తే `మల్లేశం` సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయిన అమ్మడు తర్వాత `వకీల్ సాబ్` న‌టించ‌డం ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్ ఇంకా కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

ప్రతి సినిమాలోనూ త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అయితే బ్యూటీ న‌టిగా ఇంకా షైన్ అవ్వాల్సి ఉంది.ఆర‌క‌మైన ఛాన్స్ లు అందుకోవ‌డంలో వెనుక‌బ‌డే ఉంది.

స్టార్ హీరోలు.. టైర్ టూ హీరోల స‌ర‌స‌న ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అందుకోవ‌డంలో ఆల‌స్యం జ‌రుగుతుంది. ఒక్క యంగ్ హీరోతో ఛాన్స్ వ‌చ్చినా కమర్షియల్ అందుకుని నిల‌దొక్కుకోవాల‌ని వెయిట్ చేస్తోంది. ఆ టర్నింగ్ కోసం యువ నాయిక ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం చేతిలో కొన్ని చిన్నా చితకా సినిమాలున్నాయి. వీటితోపాటు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఆసక్తిగానే ఉంది.