Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : వావ్ ఇంతలో ఎంత మార్పు మేడం..!
By: Tupaki Desk | 13 Sep 2022 2:30 PM GMTతమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే తమిళనాట నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఈమధ్య కాలంలో విలన్ రోల్స్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ ఉన్న విషయం తెల్సిందే. అందుకు కారణం ఆమె కాస్త బరువు పెరగడం అనేది అభిమానుల మరియు ఇండస్ట్రీ వర్గాల వారి యొక్క అభిప్రాయం.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా క్రాక్ సినిమాలో పోషించిన పాత్రతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక సీనియర్ నటి చేసినట్లుగా వరలక్ష్మి ఆ పాత్రను చేసింది.
ఇంకా హీరోయిన్ గా చేసే వయసు ఉన్నా కూడా ఇలా పెద్ద వయసు పాత్రలు చేయడం ఏంటో అంటూ కొందరు ఆ సమయంలో కామెంట్స్ చేశారు.
ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా బొద్దుగా కనిపించిన వరలక్ష్మి ఉన్నట్టుండి ఇంతగా నాజూకుగా మారి ఆశ్చర్య పర్చిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ ఫోటోలు రీసెంట్ ఫోటోలేనా అనే అనుమానంను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇంత సమయంలో ఇంతగా సన్నబడ్డ మీరు ఇక నుండి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాల్సిన అవసరం లేదని.. మీరు ఇక నుండి మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేయాలని కోరుకుంటూ అభిమానులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడి కొత్త ఫోటోలు.. కొత్త లుక్ తో వైరల్ అవుతున్నాయి. మరి వరలక్ష్మి హీరోయిన్ గా మళ్లీ ప్రయత్నించేనా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.