Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : స్టార్‌ హీరోయిన్‌ ఇంతలో ఎంత మార్పో

By:  Tupaki Desk   |   15 Nov 2020 10:30 AM GMT
ఫొటోటాక్‌ : స్టార్‌ హీరోయిన్‌ ఇంతలో ఎంత మార్పో
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అనే విషయం తెల్సిందే. తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అంటూ విరుష్క ప్రకటించింది నిన్న మొన్ననే అన్నట్లుగా ఉంది. కొన్ని రోజుల క్రితమే అనుష్క స్లిమ్‌ గా చాలా ముద్దుగా సినిమాల్లో నటించినట్లుగా అనిపించింది. కాని ఇంతలో అనుష్క లో ఎంతో మార్పు. అమ్మ అవ్వబోతున్న ఎవ్వరు అయినా కాస్త బరువు పెరగడం కామన్‌. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం.. బేబీ ఆరోగ్యం కోసం ఎక్కువగా ఆహారం మరియు మందులు తీసుకోవడంతో పాటు సంతోషంగా ఉండటం వల్ల కూడా గర్బవతులు బరువు పెరుగుతారు అంటారు. ఇప్పుడు అనుష్క శర్మ కూడా చాలా బరువు పెరిగారు.

ఈమద్య కాలంలో ఆమె తన లాంగ్‌ ఫొటోలను షేర్‌ చేయలేదు. అలాగే క్లోజప్‌ లను కూడా అంతగా నెట్టింట పెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఉన్న ఫొటోలకు తాజాగా దీపావళి సందర్బంగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలకు చాలా తేడా అనిపిస్తుంది. బాగా డ్రస్‌ అప్‌ అయ్యి తిని కూర్చోవడమే అంటూ ఫన్నీగా తనకు తాను కౌంటర్‌ అన్నట్లుగా వేసుకుంది. ఇదే సమయంలో అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. మొత్తానికి అనుష్క దీపావళి సందర్బంగా వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌ లో మెరిసి పోతూ బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉన్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. మరి కొన్ని రోజుల్లో విరుష్క దంపతులు పండంటి బాబు లేదా పాపను ఎత్తుకుని ఆడించబోతున్నారు.