Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : రోజు రోజుకు మరీ ఇంత క్యూట్‌ అవుతున్నారేంటి మేడం?

By:  Tupaki Desk   |   24 April 2022 1:30 AM GMT
ఫోటోటాక్ : రోజు రోజుకు మరీ ఇంత క్యూట్‌ అవుతున్నారేంటి మేడం?
X
ప్రేమమ్‌ అనే సినిమా తో సౌత్‌ సినీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా ఇండస్ట్రీలో స్టార్‌ డమ్‌ దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. హీరోయిన్ గా సుధీర్ఘ కాలం కెరీర్‌ లో సాగుతున్న ఈ అమ్మడు మెల్ల మెల్లగా పెద్ద సినిమాలకు దగ్గర అవుతుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాల ద్వారా కంటే కూడా ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారానే గుర్తింపు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా తెలుగు.. తమిళం మరియు మలయాళంలో సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షూట్‌ ను ప్రేక్షకుల ముందుకు షూట్‌ చేస్తుంది. ఆ ఫోటో లకు ఆమె ఫాలోవర్స్ మరియు నెటిజన్స్ ఫిదా అవ్వాల్సిందే. క్యూట్‌ లుక్.. హాట్‌ లుక్.. ఫ్యామిలీ లుక్.. ఇలా ప్రతి ఒక్క లుక్ లో కూడా అరే భలే ఉందే అంటూ అభిమానులు అనుకునేలా ఉంటుంది.

తాజాగా ఈ ఫోటోలు షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్‌ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాల్లో లుక్‌ కంటే ఇలా క్యూట్‌ గా హాట్‌ గా ఉన్నావు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందమైన అమ్మాయి అంటూ ప్రతి ఒక్కరితో ప్రశంసలు దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్‌ ఈ ఫోటోలతో మరోసారి సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.

2015 సంవత్సరంలో ప్రేమమ్‌ సినిమా తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన అనుపమ తెలుగు లో మాత్రం కాస్త ఆలస్యంగా 2016 సంవత్సరంలో త్రివిక్రమ్‌ మూవీ 'అఆ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సెకండ్‌ హీరోయిన్ అయినా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. అదే ఏడాది తెలుగు ప్రేమమ్‌ లో కూడా ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈమద్య కాలంలో కూడా వరుసగా సినిమాలను చేస్తూ వస్తుంది. తెలుగు లేదా తమిళం అని కాకుండా అంది వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను కూడా ఈమె ఓకే చెప్పేస్తుంది. చివరకు ఒక షార్ట్‌ ఫిల్మ్‌ లో కూడా నటించి నటిగా మంచి మార్కులు దక్కించుకున్న విషయం తెల్సిందే.

అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పటికే నటించిన కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత తెలుగులో ఈ అమ్మడు మరింతగా బిజీ అయ్యేనో చూడాలి.