Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : మెగా హీరోయిన్ అందాల ఆరబోత హద్దులు దాటింది

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 PM GMT
ఫోటోటాక్‌ : మెగా హీరోయిన్ అందాల ఆరబోత హద్దులు దాటింది
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితం తారు మారు అయినా కూడా హీరోగా వరుణ్ తేజ్ కు మంచి పేరు వచ్చింది. సినిమా కోసం ఆయన పడ్డ కష్టం సినిమాలో కనిపించింది. కాని దర్శకుడు హీరో కష్టంను సరిగా చూపించడం లో విఫలం అయ్యాడు అనే విమర్శలు వచ్చాయి. హీరోయిన్ గా వరుణ్‌ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ నటించిన విషయం తెల్సిందే.

గని సినిమా తో సాయి మంజ్రేకర్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చి చాలా ఆశలు పెట్టుకుంది. కాని మొదటి సినిమా తోనే టాలీవుడ్‌ లో సాయి మంజ్రేకర్‌ కు కమర్షియల్ గా నిరాశ తప్పలేదు. హీరోయిన్ గా ఆమె ఎంట్రీ సక్సెస్ అవ్వక పోయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె కు మంచి భవిష్యత్తు ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్‌ వారు మరియు సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ గా సాయి మంజ్రేకర్‌ నటించిన గని సినిమా లో అందాల ప్రదర్శణకు స్కోప్ లేకుండా పోయింది. ఆమె కు నటిగా తన ప్రతిభ కనబర్చే అవకాశం కూడా అంతగా దక్కలేదు. కాని అవకాశం వస్తే ఏ స్థాయిలో అందాల విందు చేస్తుందో ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఆమె కొత్త ఫోటోలను చూసి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాయి మంజ్రేకర్ తాజాగా ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్‌ వైరల్‌ అవుతోంది. బాబోయ్ ఇంత అందమా అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అందాల విందులో హద్దులు దాటేసింది.. ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

క్లీ వేజ్‌ షో తో పాటు థైస్ ను విచ్చలవిడిగా ఎక్స్ పోజ్ చేసి ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని నెటిజన్స్ కోరుకునేలా చేసింది. బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ఈ ఫోటోలను చూసిన తర్వాత ఉత్తరాది సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సాయి మంజ్రేకర్‌ అందాల విందు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.