Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : మెగా స్టార్‌.. సూపర్ స్టార్‌ కలయిక

By:  Tupaki Desk   |   19 April 2022 5:10 AM GMT
ఫోటోటాక్ : మెగా స్టార్‌.. సూపర్ స్టార్‌ కలయిక
X
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి మరియు కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ లను ఒకే స్టేజీ పై చూడాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు. అయితే వారిద్దరు ఈమద్య కాలంలో కలువక చాలా ఏళ్లు అవుతుంది. హీరోలుగా వారిద్దరు కూడా బిజీ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అయినా కూడా తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామోజీ రావు మనవరాలి పెళ్లి సందర్బంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి మొదలుకుని ఎంతో మంది స్టార్స్ కూడా పాల్గొన్నారు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ ఫోటోలు మరియు వీడియో లు వైరల్‌ అవుతున్నాయి. రామోజీ రావు కు ఉన్న పేరు నేపథ్యంలో ఆయన మనవరాలి పెళ్లికి ఎంతో మంది స్టార్స్ తరలి వచ్చారు.

ఈ పెళ్లి వేడుక సందర్బంగా చాలా మంది ప్రముఖులు కలిశారు. చిరంజీవి మరియు రజినీకాంత్ లు కలిసి సరదాగా కొద్ది సమయం మాట్లాడారు.

రజినీకాంత్ తో చిరంజీవి మరియు ఆయన సతిమణి చాలా సమయం పలువురు సెలబ్రెటీలతో మాట్లాడటం వీడియోలు మరియు ఫోటోల్లో చూశాం.

రజినీకాంత్‌ మరియు చిరంజీవిలు కలిసి చాలా సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వీడియో లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇద్దరి సినిమాల విషయానికి వస్తే చిరంజీవి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు రజినీకాంత్‌ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.