Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : ఇద్దరు ముద్దుగుమ్మల అందల విందు

By:  Tupaki Desk   |   7 May 2022 2:09 PM GMT
ఫోటోటాక్‌ : ఇద్దరు ముద్దుగుమ్మల అందల విందు
X
బాలీవుడ్ లో స్టార్స్ కిడ్స్ కు కొదవ లేదు. ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ వారసులు అనే విషయం తెల్సిందే. అయితే వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది కనుమరుగయ్యారు. కాని కొందరు మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ స్టార్‌ లు గా సూపర్ స్టార్‌ లుగా వెలుగు వెలుగుతున్నారు. బాలీవుడ్‌ లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఆలియా భట్‌ మరియు ఈమద్య హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న జాన్వీ కపూర్‌ కలిశారు.

వీరిద్దరు ఒక సందర్బంగా తీసుకున్న ఫోటోను షేర్‌ చేశారు. ఆ ఫోటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఇద్దరు అందగత్తెలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. వీరిద్దరి కలయికలో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక ఆలియా భట్‌ ఇటీవలే గంగూభాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఆలియా భట్ స్థాయి మరింతగా పెరిగింది.

తెలుగు లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో కూడా ఆలియా భట్ నటించింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు మరికొన్నాళ్ల పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో ఉంటుందనే నమ్మకంగా ఉన్నారు.

ఇక జాన్నీ కపూర్‌ విషయానికి వస్తే తల్లి శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయం లోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో ఆమె నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందాల విందు చేస్తూ సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు మరియు వీడియో లు రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్నాయి.

అలాంటి వీరిద్దరు కలిసి ఇలా ఫోటో కు ఫోజ్ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అందగత్తెలను ఇలా ఒకే సారి చూసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.