Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : సమంత నిజంగా స్టన్నర్‌.. నో డౌట్‌

By:  Tupaki Desk   |   22 Jun 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : సమంత నిజంగా స్టన్నర్‌.. నో డౌట్‌
X
ఈమద్య కాలంలో రెగ్యులర్ గా సమంత మీడియాలో ఉంటుంది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు లేదా ఏదైనా టాపిక్ గురించి స్పందిస్తున్న తీరు కూడా ఈమెను వార్తల్లో ఉండేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాలు.. ఏదో ఒక ప్రాజెక్ట్‌ లు చేస్తూ బిజీగా ఉన్న సమంత తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌ ఎంట్రీ కి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ అమ్మడు ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇన్నాళ్లు ఎక్కడ దాచారు మేడం ఈ అందం ను అంటూ తమ అభిమానం ను కామెంట్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

సమంత హాట్ ఫోటోల్లో స్టన్నింగ్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వేళ అనుమానం ఉంటే ఈ ఫోటోలు చూస్తే ఎలాంటి అనుమానం లేకుండా సమంత నిజంగా స్టన్నింగ్ అంటూ ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. క్లీవేజ్ షో తో పాటు గతంలో ఎప్పుడు చూడని విధంగా సమంతను ఇలా చూస్తూ ఉంటే అభిమానులకు కన్నుల పండుగ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శాకుంతలం మరియు యశోద సినిమాలతో తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్దంగా ఉంది. సమంత వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని తమిళ చిత్రాలు మరియు ఓటీటీ ప్రాజెక్ట్ ల్లో సమంత నటిస్తోంది.

బాలీవుడ్‌ లో ఈ అమ్మడు నటించబోతున్న సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సామ్‌ ఒక ఇంగ్లీష్ సినిమాను కూడా చేస్తున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చింది. సమంత సౌత్‌ లో ఇప్పటికే స్టార్ గా నిలిచింది. త్వరలోనే ఉత్తర భారతంలో కూడా సక్సెస్‌ అవ్వడం ఖాయం అంటూ ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు.