Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బాబోయ్‌ ఏంటీ ఈ అందాల చిరుత అందం, షర్ట్‌ విప్పేస్తూ..!

By:  Tupaki Desk   |   6 April 2022 11:30 PM GMT
ఫోటోటాక్ : బాబోయ్‌ ఏంటీ ఈ అందాల చిరుత అందం, షర్ట్‌ విప్పేస్తూ..!
X
రామ్‌ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమా తోనే నేహా శర్మ హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ సంజన పాత్రకు ఆమె నూటికి నూరు శాతం కుదిరింది అనడంలో సందేహం లేదు. పూరి ఆమెను అత్యంత అందంగా మరియు పొగరుబోతు అమ్మాయిగా చూపించాడు. చిరుత సినిమా తో ఆమె టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా మారుతుందని అంతా అనుకున్నారు.. కాని జరగలేదు.

తెలుగు లో ఆమె సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు లేదా ఇతర విషయాల కారణంగా తెలుగు లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక్కడ నుండి సర్దేసుకోవాల్సి వచ్చింది. అయితే అదృష్టం కొద్ది ఈ అమ్మడికి ఇతర భాషల్లో ఆధరణ దక్కింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు హిందీ మరియు ఇతర భాషల్లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్‌ లో ముందుకు వెళ్తుంది.

మొదటి సినిమాలో కాస్త అందం అటు ఇటుగా ఉన్నా ఇప్పుడు ఈ అమ్మడి అందం కు చిన్న వంక పెట్టడానికి లేదు. మంచి ఫిజిక్ తో పాటు చక్కనైన అందం తో చూడగానే వావ్‌ అనిపించేలా ఈ అమ్మడు ఉంటుంది అనడంలో సందేహం లేదు. చిరుత బ్యూటీ నేహా శర్మ ఇప్పటికి కూడా యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించేంతటి అందం ను కలిగి ఉంది అనడంలో ఈ ఫోటోలను చూస్తే సందేహం లేదు అంటారు.

బెడ్‌ మీద నుండి అలా లేస్తూ.. షర్ట్‌ విప్పుతూ తన అందాలను మెల్లగా చూపించేలా ఎక్స్ పోజ్‌ చేసి.. బోల్డ్‌ గా కాకుండా.. వల్గర్‌ గా కాకుండా చాలా అందంగా నేహా శర్మ ఫోజ్ ఇచ్చింది. ఇలాంటి ఫోజ్ లు.. హాట్‌ లుక్‌ లు నేహా శర్మ గతంలో చాలానే ఇచ్చింది. కాని ఈసారి లుక్ తో ఆమె ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. అలాంటి ఒక బోల్డ్‌ లుక్ ను ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అనడంలో సందేహం లేదు.

తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఈ అమ్మడి ఫోటోలను చూడటం లేదా అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నా కూడా ఈమెను ఎందుకు మళ్లీ తెలుగు సినిమాల్లోకి తీసుకు రావడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వయసుతో సంబంధం లేకుండా ఈ అమ్మడు ఇంకా పాతిక ఏళ్ల అమ్మాయిగా పరువాలతో అందంగా ఉండి కట్టి పడేస్తోంది. ఈ అందాల చిరుత అందంకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే కదా..!