Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : క్లీవేజ్ షో తో మతి పోగొట్టేస్తోంది!

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:53 AM GMT
ఫొటోటాక్ : క్లీవేజ్ షో తో మతి పోగొట్టేస్తోంది!
X
శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా సొంతంగా స్టార్‌ డమ్‌ ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం ద్వారా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల జాన్వీ కపూర్‌ పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈమె నటిస్తూ తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమాల్లో నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అందాల వింధు చేస్తూ అందగత్తె అనిపించుకుంటూ ఉంది.

ఇన్ స్టా లో రెగ్యులర్ గా తన హాట్‌ ఫొటోలను షేర్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న జాన్వీ కపూర్‌ తాజాగా షేర్‌ చేసిన ఫోటో మళ్లీ వైరల్‌ అయ్యింది. క్లోజప్‌ షాట్‌ ఫోటో ను షేర్‌ చేసిన ఈ అమ్మడు కుర్రాళ్ళ మనసులను గందరగోళానికి గురి అయ్యేలా చేస్తుంది. క్లీవేజ్ షో తో మతి పోగొట్టేస్తోంది.

చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండి పోవాలి అనిపించేంత అందంగా ఉన్నావు అంటూ సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందంకు కామెంట్స్ వస్తున్నాయి. హీరోయిన్ గా ఇంకా కమర్షియల్‌ సక్సెస్ తెచ్చుకోకున్నా కూడా తన అందాలను ఇన్‌ స్టా వేదిక గా పంచుకుంటూ ఉండటం వల్ల స్టార్‌ హీరోయిన్ లను మించి పోయింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫోటోల్లో ఇంతగా అందాలను చూపిస్తే జనాలు ఏమై పోవాలి అంటూ నెటిజన్స్‌ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమా కెరీర్‌ విషయానికి వస్తే 2018 సంవత్సరంలో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా శ్రీదేవి ఉన్న సమయంలోనే ప్రారంభం అయినా కూడా ఆమె మృతి చెందిన తర్వాత విడుదల అయ్యింది. కూతురును హీరోయిన్ గా వెండి తెరపై చూడకుండానే శ్రీదేవి మృతి చెందారు.

రెండవ సినిమా గా జాన్వీ కపూర్‌ గుంజన్ సక్సేనా చేసింది. రియల్‌ లేడీ హీరో పాత్రలో జాన్వీ నటించి మెప్పించింది. కాని ఆ సినిమా కమర్షియల్‌ గా జాన్వీ కి బ్రేక్‌ ను ఇవ్వలేదు. కెరీర్ మెల్ల మెల్లగా షురూ అవుతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వల్ల బాలీవుడ్‌ స్థంభించింది.

దాంతో జాన్వీ కపూర్ సినిమాలు కూడా గత రెండేళ్లుగా ఎక్కువగా రాలేదు. ఇక మీదట ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేలా జాన్వీ ప్రయత్నాలు చేస్తుందట. ఈ ఏడాదిలో రెండు సినిమాలు వస్తాయి. మరో వైపు ఈమె వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తూ మెప్పిస్తూ ఉంది.