Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : అంతటి ఒంపులకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   24 April 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : అంతటి ఒంపులకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే
X
ముకుందా, ఒక లైలా కోసం సినిమాలతో సినిమాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు 2012 సంవత్సరంలోనే పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ సమయంలో ఈమెను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఆ రెండు సినిమాల తర్వాత హిందీలో సినిమా ను చేసేందుకు రెండేళ్లు వెళ్లింది.

డీజే సినిమా తో మళ్లీ 2017 సంవత్సరంలో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. ముకుంద సినిమాలో కనిపించిన హీరోయిన్‌.. డీజే హీరోయిన్ ఒక్కరేనా అనే అనుమానం కలిగేంతగా ఈమెలో మార్పు కనిపించింది. మొదటి రెండు సినిమాలతో పోల్చితే మూడవ సినిమా పూర్తిగా మారింది. బికినీ వేయడంతో పాటు అందాల ఆరబోత విషయంలో పీక్స్‌ అన్నట్లుగా కనిపించింది. డీజే తర్వాత టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ గా ఈ అమ్మడు మారిపోయింది.

2017 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అంటే అయిదు సంవత్సరాలుగా మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా ఈమె ఒకానొక సమయంలో స్టార్‌ హీరోలకు సైతం డేట్లు లేకపోవడంతో నో చెప్పిన సందర్బాలు ఉన్నాయి. టాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోలందరితో కూడా సినిమా చేసిన ఘనత ఈ అమ్మడికి దక్కుతుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్ గా ఓ రేంజ్ లో దూసుకు పోతున్న పూజా హెగ్డే ఇలా అందాల ఆరబోత విషయంలో... సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటో షూట్స్ విషయంలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఉంటుంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో సమానంగా ఈ అమ్మడి ఫోటో షూట్స్ కూడా ఈమెకు గుర్తింపు తెచ్చి పెడుతున్నాయి. ఉత్తరాదిన కూడా ఈమెకు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి అంటే ఈ ఫోటో షూట్స్ వల్లే అంటున్నారు.

హీరోయిన్ గా ఈ అమ్మడి స్టార్‌ డమ్‌ పెరిగినా కొద్ది ఇన్ స్టా లో ఈ అమ్మడి పాలోవర్స్ పెరుగుతూ మరింతగా పాపులారిటీని దక్కించుకుంటుంది. ఫాలోవర్స్ పెరిగే కొద్ది అందాల విందు పెరుగుతున్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌ స్టా లో 20 మిలియన్ ల ఫాలోవర్స్ కు ఈ అమ్మడు చేరువయ్యింది.