Begin typing your search above and press return to search.
పిక్ టాక్: స్టైలిష్ మాఫియా డాన్ గా ఐకాన్ స్టార్..!
By: Tupaki Desk | 30 July 2022 3:48 AM GMT'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' కోసం సన్నద్ధం అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే గ్యాప్ లో కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు బన్నీ.
ఇటీవల ఒక సాఫ్ట్ డ్రింక్ యాడ్ షూట్ కోసం అల్లు అర్జున్ థాయిలాండ్ కి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ ప్రకటనను రూపొందించారు. ఇండియాకి తిరిగొచ్చిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఆన్ లైన్ బస్ టికెటింగ్ యాప్ కోసం ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు.
ఇదే క్రమంలో 'డీజే' దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ఓ పైప్స్ కంపెనీకి సంబంధించిన యాడ్ షూటింగ్ చేశారు బన్నీ. వరల్డ్ క్లాస్ డిఓపి సుదీప్ ఛటర్జీ దీనికి వర్క్ చేశారు. ఇందులో ఐకాన్ స్టార్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో చూడబోతున్నారని చెప్పి హరీష్ అందరిలో ఉత్సాహం కలిగించారు.
దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో బయటకు వచ్చిన ఓ ఫోటోలో అల్లు అర్జున్ బ్యాక్ సైడ్ లుక్ ని చూసి అభిమానులు షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా బన్నీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఫుల్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో అతని లుక్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి.
అల్లు అర్జున్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో నెరిసిన గడ్డంతో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. చెవికి రెండు పోగులు.. మెడలో గొలుసు.. నోట్లో సిగార్ పెట్టుకొని బన్నీ ఒక స్టైలిష్ మాఫియా డాన్ లా.. ఒక గ్యాంగ్ స్టర్ గా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ లెదర్ జాకెట్ మరియు నల్ల కళ్ళద్దాలు అతన్ని మరింత స్టైలిష్ గా మార్చేశాయి.
మొత్తం మీద కమర్షియల్ యాడ్ కోసం బన్నీ ఊర మాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే గెటప్ లో ఓ మూవీ సెట్ చేయాలని.. కుదిరితే 'డీజే 2' సినిమా ప్లాన్ చేయాలని హరీశ్ శంకర్ ను కోరుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నయా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ క్యాప్చర్ చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి బన్నీ కెరీర్ ప్రారంభం నుంచీ తన లుక్స్ మరియు స్టైలింగ్ తో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. సినిమా సినిమాకి తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ వెరీయేషన్ చూపించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇటీవల 'పుష్ప' సినిమాలో ఊర మాస్ రగ్గుడ్ లుక్ లో అదరగొట్టాడు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' పార్ట్-1 మూవీ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏమాత్రం తగ్గకుండా అంతకు నుంచి ఉండేలా 'పుష్ప: ది రూల్' సినిమాని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
'పుష్ప' పార్ట్-2 శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు జరుపుకుని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. మొదటి భాగంలో మిగిలిన పాత్రలతో పాటుగా మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ చని ఈ సినిమాలో చూడబోతున్నాం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.