Begin typing your search above and press return to search.

ఆ మెరిసే క‌ళ్లు ఆత్మ గురించి ఏమ‌ని వ‌ర్ణించాలి?

By:  Tupaki Desk   |   30 Aug 2022 4:02 AM GMT
ఆ మెరిసే క‌ళ్లు ఆత్మ గురించి ఏమ‌ని వ‌ర్ణించాలి?
X
బుట్ట‌బొమ్మ‌గా తెలుగు వారి మ‌న‌సుల్లో ఎప్ప‌టికీ నిలిచి ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న పూజా వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాల్లో న‌టిస్తోంది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ బాలీవుడ్ ని ఏల్తోంది. కానీ ఇటీవ‌ల కొన్ని వ‌రుస వైఫ‌ల్యాలు బుట్ట‌బొమ్మ‌ను క‌ల‌వ‌ర‌పెట్టాయి. అయినా త‌న‌కు అవ‌కాశాల ప‌రంగా కొద‌వేమీ లేదు.

పూజా నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ యంగేజ్ చేస్తోంది. తాజాగా పూజా హెగ్డే మంచంపై ప‌డుకుని ఉన్న‌ ఒక ఆకట్టుకునే ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

బుట్ట‌బొమ్మ‌ తన మెరుస్తున్న కళ్ళతో ఏమ‌ని ప్ర‌శ్నించిందంటే... ''మళ్ళీ కళ్ళు ఆత్మ గురించి వారు ఏమి చెబుతారు?'' అని అడిగింది.. #ఇల్లు అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. త‌న ఇంట్లోనే బెడ్ టైమ్ ఫోటోగ్రాఫ్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ పింక్ ట్యాంక్ టాప్ లో మ‌న‌సుదోచే పోజుతో పూజా క‌నిపించింది. మిల‌మిలా మెరుస్తున్న ఆ క‌ళ్ల గురించి యూత్ ఏమ‌ని వర్ణిస్తుంది? ఆమె ఆత్మ గురించి ఏమని మాట్లాడుతారో ఊహించ‌గ‌లం.

కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత భారీ సినిమాలతో తిరిగి అభిమానుల ముందుకు పూజా రాబోతోంది. 'కభీ ఈద్ కభీ దీపావళి'గా పాపుల‌రైన‌ సల్మాన్ 'భాయిజాన్‌'లో పూజ క‌థానాయిక‌. రణవీర్ సింగ్ 'సర్కస్‌'లో కూడా కనిపించనుంది.

పూజా హెగ్డే ఇటీవల హైదరాబాద్ భాయిజాన్ పాట చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది. భాయిజాన్ లో సల్మాన్- వెంకటేష్ - రామ్ చరణ్ లతో కలిసి పూజా స్క్రీన్ ని షేర్ చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. తెలుగులో మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

సంతోష‌మే స‌గం బ‌లం.. పూజా ఫార్ములా పూజా హెగ్డే ముఖంపై అందమైన చిరునవ్వు ఎప్పుడూ క‌నిపిస్తుంది. సంతోష‌మే స‌గం బ‌లం.. దాంతోనే అందం ఇనుమ‌డిస్తుంద‌ని పూజా న‌మ్ముతుంది. అందుకే త‌న మోముపై చిరున‌వ్వును అస్స‌లు చెరిగిపోనివ్వ‌దు. అలాగే సెట్లో నన్ను సంతోషపరిచేలా షూటింగ్ చేయండి అని కూడా త‌న ద‌ర్శ‌కుల‌ను కోరుతుంది ఈ బ్యూటీ. నిరంత‌రం యోగా మెడిటేష‌న్ తో ఒత్తిడిని ఈ భామ అస్స‌లు ద‌రి చేర‌నివ్వ‌దు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.