Begin typing your search above and press return to search.

లైగర్ బ్యూటీ బికినీ తో పిచ్చెక్కిస్తుంది

By:  Tupaki Desk   |   11 Jan 2022 3:30 PM GMT
లైగర్ బ్యూటీ బికినీ తో పిచ్చెక్కిస్తుంది
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు లైగర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్న లైగర్ సినిమాలో ఈమె విజయ్ దేవరకొండ తో ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న లైగర్‌ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ లో కూడా లైగర్ ను విడుదల చేయడం కోసం అనన్య పాండేనే ఈ సినిమాలో నటింపజేస్తున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. కారనం ఏదైనా అనన్య పాండే ఈ సినిమాలో నటించడం వల్ల ఖచ్చితంగా అన్ని చోట్ల మంచి బజ్ అయితే క్రియేట్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా బాలీవుడ్‌ లో వరుస సినిమాలను చేస్తున్న అనన్య పాండే లైగర్ సినిమా తర్వాత సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌ నుండి ఇప్పటికే అనన్య పాండేకు రెండు మూడు పెద్ద ఆఫర్లు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. కాని వాటికి ఆమె నో చెప్పింది. లైగర్ బ్యూటీ అందాల వింధుకు పెట్టింది పేరు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలను షేర్‌ చేస్తూ వస్తుంది. ఆమె ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన బికినీ వీడియో వైరల్‌ అయ్యింది. బికినీలో అలా బీచ్ లో ఎంజాయ్‌ చేస్తున్న అనన్య పాండే వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాల్లో కంటే ఇలా ఎక్కువగా అందాల విందు చేస్తున్న అనన్య పాండే తన అందంతో యూత్‌ కు పిచ్చెక్కిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఏం షేర్ చేసినా కూడా వైరల్‌ అవుతుంది. అలాంటిది ఈఅమ్మడి హాట్ ఫొటో మరియు వీడియో షేర్‌ చేస్తే ఇంకేమైనా ఉందా.. కోట్ల మంది చూడటం జరుగుతుంది. లక్షల మంది లైక్ మరియు షేర్ చేయడం అవుతుంది. ఇప్పుడు అదే ఈ వీడియోకు కూడా జరుగుతుంది.