Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : చరణ్ ఉపాసన మంచి మనసుకు ఇదే నిదర్శణం

By:  Tupaki Desk   |   6 Jun 2022 7:43 AM GMT
పిక్ టాక్‌ : చరణ్ ఉపాసన మంచి మనసుకు ఇదే నిదర్శణం
X
ఈమద్య కాలంలో రామ్‌ చరణ్ మరియు ఉపాసనల యొక్క మంచితనం గురించి.. వారి యొక్క చారిటీ గురించి ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. ఇద్దరు వారి వారి కెరీర్‌ లో ఎంత బిజీగా ఉన్నా కూడా అన్యోన్యంగా ప్రత్యేక సందర్బాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఉపాసన ఈమద్య కాలంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఉపాసన వంటి భార్య లభించడం చరణ్‌ అదృష్టం అనేంతగా ఆమె సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది.

తాజాగా చరణ్ మరియు ఉపాసనలు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి చరణ్‌ పర్సనల్‌ డ్రైవర్‌ పుట్టిన రోజు సందర్బంగా అతడితో కేక్ కట్‌ చేయించారు. ఆ సమయంలో అతడి మొహంలో ఆనందం కు అవధులు లేవు.

ఒక డ్రైవర్ కు ప్రత్యేక శ్రద్ద చూపించి కేక్ కట్‌ చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు కాని తమ పర్సనల్‌ డ్రైవర్ లను అంతగా చూసుకునేవాళ్లు చరణ్ దంపతులే అంటూ మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ డ్రైవర్‌ భుజం పై చేయి వేసి చరణ్‌ కేక్‌ కట్‌ చేయించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో పక్కన ఉపాసన కూడా ఉండి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉపాసన మరియు చరణ్ ల ప్రత్యేక శుభాకాంక్షలు మరియు కేక్ కట్‌ చేయించడంతో తన జీవితంలోనే గొప్ప పుట్టిన రోజు అంటూ డ్రైవర్ నరేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను చేయడం జరిగింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆచార్య సినిమా తో వచ్చినా అది నిరాశ పరిచింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ను చరణ్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.