Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ''సార్'' డ్యూటీ ఎక్కేశాడు

By:  Tupaki Desk   |   7 Jan 2022 6:30 AM
పిక్ టాక్ : సార్  డ్యూటీ ఎక్కేశాడు
X
తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌ ధనుష్‌ ఇప్పుడు తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఒక వైపు తమిళంలో వరుస సినిమాలు.. హాలీవుడ్ వెబ్‌ సిరీస్ లు.. హిందీ ప్రాజెక్ట్‌ లు ఉన్నా కూడా తెలుగు మరియు తమిళంలో తెలుగు దర్శకుడితో సినిమాను చేసేందుకు ధనుష్ చాలా ఆసక్తిని చూపించాడు. అందుకే బ్యాక్ టు బ్యాక్ శేఖర్‌ కమ్ముల మరియు వెంకీ అట్లూరి ల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు సైన్ చేశాడు. శేఖర్‌ కమ్ముల తో ధనుష్ తెలుగు ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. కాని శేఖర్‌ కమ్ముల సినిమాకు ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఈ లోపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్‌ సినిమా ను షురూ చేశాడు ధనుష్‌. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి.. షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టవచ్చు అనుకుంటూ ఉండగానే సర్‌ సెట్స్ పైకి వెళ్లాడు.

ధనుష్‌ సర్‌ లుక్‌ ను రివీల్‌ చేశారు. సింపుల్‌ గా పాయింట్‌ షర్ట్‌ లో ధనుష్‌ ఉన్నాడు. ఈ గెటప్ లో ధనుష్ స్టూడెంట్‌ గా కూడా అనిపిస్తున్నాడు అనే వారు లేక పోలేదు. మరి ఇందులు ధనుష్ స్టూడెంట్‌ గా కనిపించబోతున్నాడా లేదా సర్ గా కనిపిస్తాడా అనేది తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు సర్ గురించిన విషయాలు సినిమా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా లో ఒక మంచి మెసేజ్ ను కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ధనుష్ సినిమా లు ఇప్పటి వరకు తెలుగు లో ఒకటి రెండు మాత్రమే కాస్త ప్రభావం చూపించగలిగాయి. ధనుష్ నటించిన డబ్బింగ్‌ సినిమాలు ఇక్కడ సక్సెస్ అవ్వక పోవడంతో నేరుగా తెలుగు వారిని మెప్పించాలని.. తెలుగు లో స్టార్‌ గా నిలవాలనే ప్రయత్నంతో ధనుష్ ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వెంకీ అట్లూరి చేసినవి మూడు సినిమాలే అయినా కూడా మూడు విభిన్నమైన కాన్సెప్ట్ లతో తెరకెక్కించాడు. ప్రతి సినిమాలో కూడా ఒక మంచి ప్రేమ కథను దర్శకుడు చూపించాడు. కనుక ఈ సినిమాలో కూడా ఒక ఎమోషన్‌ తో కూడిన లవ్‌ స్టోరిని చూపిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ధనుష్‌ తో ఎలాంటి కథను తీసుకున్నా కూడా ఆయన న్యాయం చేస్తాడు. నాచురల్‌ స్టార్‌ అనే పేరుకు ఖచ్చితంగా ధనుష్‌ యాప్ట్‌ అవుతాడు అనడంలో సందేహం లేదు. అందుకే సర్‌ సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సర్‌ సినిమా ను తమిళంలో వాతి గా విడుదల చేయబోతున్నారు.

ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కొన్ని సీన్స్ లో తెలుగు మరియు తమిళంలో వేరు వేరు నటీ నటులు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ద్వి భాష సినిమా అంటే షూటింగ్‌ డబుల్‌ డబుల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పిస్తుంది. షూటింగ్‌ ప్రారంభం అయిన రోజే ప్రీ లుక్ ను రివీల్ చేశారు కనుక త్వరలోనే ఫస్ట్‌ లుక్ కూడా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ధనుష్ కమిట్‌ అయిన ప్రాజెక్ట్‌ ల నేపథ్యంలో సర్ సినిమా ను స్పీడ్‌ గానే ముగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.