Begin typing your search above and press return to search.
టుస్సాడ్స్ స్టాట్యూ: డబుల్ డెక్కర్ చందమామ
By: Tupaki Desk | 5 Feb 2020 6:35 AM GMTఇదిగో ఇక్కడ కనిపిస్తున్న డబుల్ డెక్కర్ చందమామను చూశారా? ఆనందం ఆవర్ణమైన వేళ కాజల్ అగర్వాల్ ఈ డబుల్ ట్రీట్ ని మస్త్ మజాగా ఆస్వాధిస్తోంది. అచ్చం తనలానే చారెడేసి కళ్లు బూరె బుగ్గలతో ఎలా ఊరిస్తోందో చూశారు కదా! అసలు అది విగ్రహం అంటే ఎవరైనా నమ్మగలరా? అంతందంగా మైనపు విగ్రహాన్ని డిజైన్ చేసి కానుకగా ఇచ్చింది మ్యాడమ్ టుస్సాడ్స్. సింగ పూర్ లో నేడు ఈ విగ్రహావిష్కరణకు రియల్ చందమామ ఎటెండయ్యింది.
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ లో వ్యాక్స్ స్టాట్యూ పొందిన తొలి దక్షిణ భారత నటిగా కాజల్ అగర్వాల్ రికార్డులకెక్కింది. నేటి విగ్రహావిష్కరణలో కాజల్ సహా తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తనతో పాటు తల్లిదండ్రులు- సోదరి .. తన బావమరిది ఉన్నారు. వాస్తవానికి ఈ సంగతిని అభిమానులతో డిసెంబర్ లో కాజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ``నేను చిన్నతనంలో మేడమ్ టుస్సాడ్స్ కు వెళ్లాను. అక్కడ ఉన్న విగ్రహాలతో ప్రేమలో పడ్డాను. నాక్కూడా వ్యాక్స్ స్టాట్యూ రెడీ అవ్వడం సంతోషాన్నిస్తోంది`` అంటూ ఆనందం వ్యక్తం చేసింది. నేటితో తన కల నెరవేరింది. మేడమ్ టుస్సాడ్స్ లో కాజల్ అగర్వాల్ తన మైనపు విగ్రహం తో ఇదిగో ఇలా ఫోజిచ్చింది. ప్రభాస్ - మహేష్ తర్వాత ఇలాంటి అరుదైన ఘనత సాధించిన సౌత్ స్టార్ గా కాజల్ ఆనందానికి అవధులే లేవు. ఈ సందర్భంగా ఈ వారం అంతా కాజల్ కంటికి అస్సలు కునుకే పట్టలేదట. అసలే తనకు నిద్రలేమి సమస్య ఉంది. అది కాస్తా ఎగ్జయిట్ మెంట్ తట్టుకోలేక మరింత డబుల్ అయ్యిందట.
కాజల్ కెరీర్ ని పరిశీలిస్తే.. ప్రస్తుతం జాన్ అబ్రహం సరసన హిందీ చిత్రం `ముంబై సాగా` చిత్రీకరణ లో పాల్గొంటోంది. మరో వైపు కమల్ హాసన్ భారతీయుడు 2 (ఇండియన్ 2) లోనూ నాయికగా నటిస్తోంది. సమ్మర్ లో ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్- ప్రియా భవానీ శంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే క్వీన్ రీమేక్ `ప్యారిస్ ప్యారిస్` రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఇండో-అమెరికన్ భాగస్వామ్యంలో ఓ హాలీవుడ్ చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. ఈ చిత్రంలో విష్ణు మంచు కథా నాయకుడి గా నటిస్తున్నారు. ఓ తమిళ చిత్రం లో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటించనుంది.