Begin typing your search above and press return to search.

బ్లాక్ లెదర్ లుక్ తో మ‌తులు చెడేలా..!

By:  Tupaki Desk   |   2 Jan 2022 1:30 AM GMT
బ్లాక్ లెదర్ లుక్ తో మ‌తులు చెడేలా..!
X
బాస్ లేడీ చెల‌రేగిపోతోంది. న‌గ‌రంలో న‌ట్ట‌న‌డి వీధిలో రెబ‌ల్ లా చెల‌రేగిపోతోంది. టాప్ టు బాట‌మ్ బ్లాక్ లుక్ లో మ‌తులు చెడ‌గొడుతోంది. ఇంత‌కీ ఎవ‌రీ బాస్ లేడీ? అంటే చెప్పాల్సిన ప‌నే లేదు. అందాల మాళ‌విక మోహ‌న‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంది.

బ్లాక్ లెద‌ర్ డ్రెస్ లో లేడీ బాస్ నే త‌ల‌పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం త‌మిళంలో వ‌రుస‌ ఆఫ‌ర్లు అందుకుంటోంది. స్వ‌త‌హాగానే సినిమాటోగ్రాఫ‌ర్ మోహన‌న్ కుమార్తెగా త‌న‌కు ఒక రేంజు ఉంది. కానీ మోడ‌ల్ గానూ మాళ‌విక అసాధార‌ణ ప్ర‌జ్ఞ ను క‌న‌బ‌రిచి న‌టిగా స‌త్తా చాటుతోంది.

నేటిత‌రంలో ఎదురేలేని ఫ్యాష‌నిస్టాగా యువ‌త‌రం గుండెల్లో నిలుస్తోంది. మాళ‌విక తాజా లుక్ యూత్ లో వైర‌ల్ గా మారింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్ర‌స్తుతం కోలీవుడ్ లో `మార‌న్`..బాలీవుడ్ లో `యుద్ర‌` సినిమా చేస్తోంది. ఈ రెండు చిత్రాలు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. అయితే షూటింగ్ మాత్రం ఆల‌స్య‌మ‌వుతోంది. అందుకు గ‌ల కార‌ణాలు ఏంట‌న్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈ రెండు ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసి నెల‌లు గ‌డుస్తున్నాఎలాంటి అప్ డేట్ లేదు.

అలాగే టాలీవుడ్ ప్ర‌య‌త్నాలు సీరియ‌స్ గానే చేస్తోందిట‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఏభాష‌లోనూ స్థిర‌ప‌డ‌లేదు. ఆ ర‌కంగా అవ‌కాశాలు అందుకోవ‌డం విఫ‌లం కావ‌డంతోనే ఈ డైల‌మా. టాలీవుడ్ లో ఛాన్స్ వ‌స్తే వెంట‌నే క్యాచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తెలుగు అగ్ర హీరోలు చ‌ర‌ణ్‌-తార‌క్-ప్ర‌భాస్-రానా వంటి హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు ఆస‌క్తిగా ఉంది ఈ భామ‌.