Begin typing your search above and press return to search.

పిక్ టాక్: కుర్ర భామతో రవితేజ రొమాంటిక్ 'ధమాకా'..!

By:  Tupaki Desk   |   30 Aug 2022 6:30 AM GMT
పిక్ టాక్: కుర్ర భామతో రవితేజ రొమాంటిక్ ధమాకా..!
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ధమాకా''. 'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సరికొత్త అప్డేట్ తో వచ్చారు.

ఇటీవల 'జింతాక్' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడం ద్వారా ధమాకా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రవితేజ - శ్రీలీల జోడీ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులతో కూడిన ఈ ఫోక్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా ఆగస్టు 31 సాయంత్రం 5:01 గంటలకు గ్లిమ్స్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్మెంట్ పోస్టర్ కలర్ ఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తోంది. రవితేజ ఇందులో శ్రీలీలని తన దగ్గరికి లాక్కొని, కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమెని ఆందోళనకు గురిచేసాడు. శ్రీలీలా ఎల్లో కలర్ హాఫ్ శారీలో తన నాభి అందాలను ప్రదర్శిస్తోంది. రవితేజ గత చిత్రాల్లో మాదిరిగానే ఇందులో రొమాన్స్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ సూచిస్తోంది.

ఎనర్జీకి పేరుగాంచిన రవితేజ మరియు కమర్షియల్ సబ్జెక్ట్స్ ను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాథరావు కలిసి 'ధమాకా' సినిమాతో అపరిమితమైన వినోదాన్ని అందించనున్నారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ధమాకా' సినిమాలో అగ్ర నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణుల బృందం ఈ సినిమాలో భాగమైంది.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ డిజైన్ చేయగా.. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.