Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : గణేష్ పూజలో ఫ్యామిలీతో రియల్‌ హీరో

By:  Tupaki Desk   |   3 Sept 2022 6:38 AM
పిక్ టాక్ : గణేష్ పూజలో ఫ్యామిలీతో రియల్‌ హీరో
X
సోనూ సూద్ అనగానే ఒకప్పుడు ఆయన చేసిన విలన్‌ పాత్రలు గుర్తుకు వచ్చేవి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆయన అరుంధతి సినిమాలో పోషించిన పశుపతి పాత్ర గుర్తుకు వచ్చేది. కానీ కరోనా సమయంలో ఆయన వలస కార్మికుల కోసం నిలబడ్డ తీరుతో ఆయన ఒక రియల్‌ హీరో గా గుర్తుండి పోయాడు. కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లుగా సోనూ సూద్‌ కెరీర్‌ ను పరిగణించవచ్చు.

కరోనా సమయంలో ఆయన చేసిన ఛారిటీ అంతా ఇంతా కాదు. వేలాది మంది వలస కార్మికులకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఆయన దాతృత్వంకు ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్‌ చేశారు.

ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా ఆయన చేస్తున్న తీరు చూసి కోట్లాది మంది ఆయనకు ఫిదా అయ్యారు.. ఫ్యాన్‌ గా మారి పోయారు అనడంలో సందేహం లేదు.

రియల్‌ హీరోగా పేరు దక్కించుకున్న సోనూసూద్‌ తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేశాడు. వినాయక చతుర్ది సందర్భంగా కుటుంబ సభ్యులతో పూజలో పాల్గొన్న సోనూసూద్‌ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. ఫోటోలో సోనూసూద్‌ ఇద్దరు కొడుకులు అయాన్ మరియు ఇషాంత్‌ లను మరియు ఆయన భార్య సొనాలి సూద్ ను చూడవచ్చు.

కరోనా సమయంలో వచ్చిన రియల్‌ హీరో ఇమేజ్ తో సోనూసూద్ కు విలన్ వేషాలు తగ్గాయట. అయితే ఈయన హీరోగా వరుసగా సినిమాలను చేసేందుకు పలు ప్రొడక్షన్ హౌస్ లు ముందుకు వస్తున్నాయి.

కానీ ఆచి తూచి హీరోగా సినిమాలను సోనూసూద్ ఎంపిక చేసుకుంటున్నాడు. ఇక ఈయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని సోనూసూద్‌ అన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.