Begin typing your search above and press return to search.

తిండి మానేసిన అంజ‌లి ఇలా అయ్యింది!

By:  Tupaki Desk   |   11 Aug 2022 2:30 AM GMT
తిండి మానేసిన అంజ‌లి ఇలా అయ్యింది!
X
అస‌లు అది ఎవ‌రు? మ‌న సీత‌ అంజ‌లేనా? ఇంత‌గా మారిపోయింది.  రూపం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా?  మ‌రీ సైజ్ జీరో పేరుతో శ‌రీరాన్ని బాగా హింసించింది!! ఇదీ అంజ‌లి లేటెస్ట్ ఫోటో చూడ‌గానే అంద‌రిలో డౌట్. అయితేనేం అంజ‌లికి ఈ మేకోవ‌ర్ ఎంతో బావుంది. బొద్దుత‌నం నుంచి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి స్లిమ్ లుక్ తో క‌నిపిస్తే మునుముందు క్రేజీ నంబ‌ర్ల‌లో ఛాన్సులు ద‌క్కే వీలుంది.

నితిన్ `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో అంజ‌లి స్పెష‌ల్ పాట ఒక ఊపు ఊప‌నుంది. ఈ చిత్రంలోని `రా రా రెడ్డి` పాట అంద‌ర‌లోకి దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ఇది.

ఇటీవ‌లి కాలంలో అత్యధికంగా వీక్షించిన వీడియోలలో ఒకటిగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఈ పాట ఒక రేంజులో వైర‌ల్ అయ్యింది.

చాలా మంది ఈ పాట‌కు యాప్ ల‌లో అనుస‌ర‌ణ‌లు సృష్టిస్తున్నారు. పాట హుక్ స్టెప్ ను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రారా రెడ్డి పాట స్పంద‌న చూశాక అంజ‌లి ఫుల్ జోష్ లో ఉంది.

పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనిది ఈ ఫోటోగ్రాఫ్. చీర ర‌వికెలో ఎంతో అందంగా ముస్తాబై ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో అంజ‌లి ఫోజులిచ్చింది. ఈ స్లిమ్ లుక్ లో త‌న అందం రెట్టింపైంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. చాలా గ్యాప్ త‌ర్వాత అంజలి తెలుగు అభిమానుల ముందుకు వ‌స్తుంటే ఆ జోష్ మ‌రో లెవ‌ల్లో క‌నిపిస్తోంది. అంజ‌లి న‌టించే స్ట్రెయిట్ తెలుగు సినిమాల వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. త‌మిళంలో ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది.